ఎపిక్‌ న్యూ స్విప్ట్‌ను ఆవిష్కరించిన బిగ్‌ బాస్‌ ఫేమ్‌ శ్రీసత్య

నవతెలంగాణ-హయత్‌నగర్‌
మారుతి సుజికి ఇండియా ది ఎపిక్‌ న్యూ స్విప్ట్‌ కొత్త మోడల్‌ను హైదరాబాద్‌ మార్కెట్‌లో విడుదల చేసింది. నగరంలోని ఎల్బీనగర్‌లో ఉన్న మారుతి సుజికి ఎరినా కళ్యాణి మోటర్స్‌లో ఈ ఎపిక్‌ న్యూ స్విప్ట్‌ ను టాలీవుడ్‌ నటి, బిగ్‌ బాస్‌ ఫేమ్‌ శ్రీ సత్య ఆవిష్కరించారు. అనంతరం మొదటి ఐదుగురు వినియోగదారులకు శ్రీసత్య తాళం చెవిని అందజేశారు. కళ్యాణి మోటర్స్‌ ద్వారా ఎపిక్‌ న్యూ స్విప్ట్‌ కొత్త మోడల్‌ ట్రెండ్‌ సెట్టింగ్‌ వర్చువల్‌ అనుభూతిని అందిస్తుందని, ఇప్పటివరకు వందకు పైగా కంటే ఎక్కువ బుకింగ్‌లు నమోదయ్యాయని కళ్యాణి మోటార్స్‌ సీఈఓ వేంకటేశ్వరరావు పేర్కొన్నారు. సాంకేతిక, ట్రెండ్‌కు అనుగుణంగా రూపొందించబడిన ఎపిక్‌ న్యూ స్విఫ్ట్‌ సరి కొత్త బెంచ్‌ మార్క్‌ను సష్టిస్తుందని, ఫోర్త్‌ జనరేషన్‌ స్విఫ్ట్‌ దాని సెగ్మెంట్‌లో అత్యంత ఇంధన-సమర్థవంతమైన హ్యాచ్‌బ్యాక్‌, 25.75 సఎ/శ్రీ వరకు సామర్థ్యంతో ,గత తరం స్విఫ్ట్‌ కంటే 14% మెరుగుదలని సూచిస్తుందని అన్నారు. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, అన్ని సీట్లకు 3-పాయింట్‌ సీట్‌ బెల్ట్‌లు, ఈ ఎస్‌ పీ, ఈ బీ డీతో కూడిన ఏ బీ ఎస్‌, హిల్‌ హౌల్డ్‌ అసిస్ట్‌ వంటి అనేక భద్రతా వంటి అనేక ఫీచర్‌లను కలిగి ఉన్నాయని వివరించారు.