ప్రశాంతంగా ముగిసిన పార్లమెంట్ ఎన్నికలు

– అక్కడక్కడ చెదురుమదురు ఘటన

నవతెలంగాణ- రామారెడ్డి
 మండలంలో పార్లమెంట్ ఎన్నికలు చదురుమాదులు గతంలో తప్ప సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. ఎంపీపీ దశరథ్ రెడ్డి, జెడ్పిటిసి నా రెడ్డి మోహన్ రెడ్డి పోసానిపేటలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. రామారెడ్డి తో పాటు పలు పోలింగ్ కేంద్రాలను ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పరిశీలించారు. మద్దికుంటలో కాంగ్రెస్, బిజెపి నాయకుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకోగా, పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. స్కూల్ తండాలో ఈవీఎం మొరాయించగా, నిపుణుల సహకారం 15 నిమిషాల్లో సరి చేశారు. పోసానిపేటలో, గిద్దలో ఈవీఎం ప్యాడ్ పై ఇంకు పడటంతో అధికారులు ఇంకును తొలగించారు. పోసానిపేటలో ఎస్సీ కాలనీలో అభివృద్ధి లేదని, అధికార పార్టీ నాయకుడు ఎస్సీల ఓట్లు అవసరం లేదని అనడంతో ఓట్లు వేయకుండా బైఠాయించారు. షబ్బీర్ అలీ ఫోన్లో మాట్లాడటంతో శాంతించినట్లు కాంగ్రెస్లో ఓవర్గము ఆరోపిస్తోంది. కాంగ్రెస్ లో మరో వర్గము ఇలాంటి పుకాలను సృష్టిస్తుందని, అలాంటి వ్యాఖ్యలు చేయలేదని, రుజువు చేస్తే శిక్షకు సిద్ధమని అనటంతో ఓటు వేయడానికి సిద్ధమయ్యారని మరో వర్గం ఆరోపిస్తుంది.