ఆత్మీయ సమ్మేళనలతో జోష్ లో గులాబీ సైన్యం

నవతెలంగాణ కంటేశ్వర్ : నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల  నాగారం లోని 10, 11 డివిజన్ల టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ ఆత్మీయ సమ్మేళనం లో  ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ.. బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలలో ఉత్సాహాన్ని  నింపడానికి మరింత చైతన్యవంతులుగా తయారు చేయాలని ముఖ్యమంత్రి  కేసీఆర్, మంత్రి వర్యులు  కేటీఆర్ ఆదేశించారు.బి.ఆర్.ఎస్ పార్టీకి కార్యకర్తలే శ్రీరామ రక్ష.మరోసారి బి.ఆర్.ఎస్ పార్టీ జెండా ఎగరరాడానికి కార్యకర్తలు కార్యదీక్ష చేపట్టండి. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యం లో బి.ఆర్.ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించండి.గత నాయకులు తీరు వల్ల అభివృద్ధి నాగారం ప్రాంతం అభివృద్ధి కి నోచుకోలేదు.2014 లో బి ఆర్ ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్  సహకారం తో ,కవితక్క సహకారం తో నాగారాన్ని అభివృద్ధి చేసాము.నాగారం అన్ని వైపులా డబుల్ రోడ్డు నిర్మించాము.కాలనీ లో రోడ్లు, డ్రైనేజి లు నిర్మించాము.నాగారం నీటి సమస్యను తీర్చడానికి 2 కోట్ల రూ.తో పీడర్ లైన్ వేసి ప్రతి ఇంటికి మంచి నీరు అందిస్తున్నాము.నాగారంలో 7 గురుకుల పాఠశాలలు నిర్మిస్తున్నాము.ఒక్క పాఠశాల 20 కోట్ల రూ.లతో 7 పాఠశాలను 140 కోట్లతో నిర్మిస్తున్నాము.
గత పాలకులు నాగరాన్ని పట్టించు కోలేదు.పేద ప్రజలు నివాసం ఉండే నాగారాన్ని విస్మరించారు. 2014 ముందు నాగారం లో సరియైన రోడ్లు లేవు-డ్రైనేజీలు లేవు,స్ట్రీట్ లైట్లు లేవు.ఇప్పుడు నాగారం కి 5 నిముషాల్లో అంబులెన్స్ వచ్చేలా రోడ్లు వేసాము. బాబాన్ సాబ్ పహాడి వద్ద కొత్త వంతెన నిర్మిస్తున్నాము.2 కోట్లా రూ.లు నాగారాం అభివృద్ధి కి నిధులు మంజూరు చేసాము. కంటేశ్వర్,వినాయక్ నగర్ ఎలా ఉందో అలాగే నాగారాన్ని అభివృద్ధి చేసే భాధ్యత తీసుకుంటాను.సంక్షేమం విషయానికి వస్తే నిజామాబాద్ నగరం లో 40000 మంది కి ఆసరా పింఛన్లు ఇస్తున్నాము. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి ఒక్క విద్యార్థికి 1 లక్ష 20 వేయిల రూ.ఖర్చు చేస్తూ ఉచితంగా నాణ్యమైన విద్యను అందిస్తున్నాము.అడా బిడ్డలకు గౌరవం పెంచి కళ్యాణ లక్ష్మీ, షాది ముభారక్ పథకాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం బి అర్ ఎస్. అభివృద్ధి-సంక్షేమం లో ముందుకెళ్తున్న బి ఆర్ ఎస్ పార్టీ నుండి మరోసారి నాకు అవకాశం ఇవ్వండి నాగారాన్ని ప్రత్యేక నిధులతో మరింత అభివృద్ధి చేస్తానని మాటిస్తున్నాను.ఈ కార్యక్రమంలో నగర మేయర్  దండు నీతూ కిరణ్ ,నుడ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి ,దండు శేఖర్,కార్పొరేటర్ బొడిగం కోమల్ నరేష్ , సిర్ప రాజు,బాబ్ల్యూ ఖాన్,సాయి వర్ధన్,చంద్రకళ,ముక్తర్,పవార్ పండరీ,సుధాకర్ మరియు కార్పొరేటర్ లు,నాయకులు పాల్గొన్నారు.