నవతెలంగాణ – అచ్చంపేట
అచ్చంపేటలో అరాచక పాలన నడుస్తుందని, బిఆర్ఎస్ వార్డ్ కౌన్సిలర్ సుంకరి నిర్మల బాలరాజు కుటుంబంపై కాంగ్రెస్ నాయకులు దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. బుధవారం బాధిత కుటుంబాన్ని బిఆర్ ఎస్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ తో కలిసి పరామర్శించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. బిఆర్ఎస్ కార్యకర్తలు నాయకుల పైన అధికారం ఉందని అహంకారంతో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు దాడి చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ కు 15 ఏళ్లుగా అధికారం లేకపోయింది. ఇప్పుడు అధికారం రాగానే అక్రమ ఇసుక రవాణా, అక్రమ మైనింగ్ పేరుతో ప్రతి నెల 50 లక్షల రూపాయలు తన ఇంట్లోకి పోతున్నాయని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రజావ్యతిరేక విధానాలను ప్రోత్సహిస్తున్నాడని ఆగ్రహం వవ్యక్తం చేశాడు. మారణ ఆయుధాలతో ఇంట్లోకి వచ్చి దాడులకు పాల్పడితే పోలీసులు ఇప్పటివరకు ఒక్కరిని కూడా ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. ఈ విషయంపై జిల్లా ఎస్పీ స్పందించి సుమోటాగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. భారత రాష్ట్ర సమితి కార్యకర్తలకు, నాయకులకు పార్టీ అండగా ఉంటుందని ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావద్దని సూచించారు. విలేకరుల సమావేశంలో మునిసిపల్ చైర్మన్ నరసింహ గౌడ్, సుంకరి బాలరాజు, లింగం, తదితరులు పాల్గొన్నారు.