నవతెలంగాణ – ఏర్గట్ల
యాసంగి వరి కోతల అనంతరం కొయ్యలను కాల్చడం వల్ల భూసారం దెబ్బ తింటుందని మండల వ్యవసాయాధికారి అబ్దుల్ మాలిక్ రైతులకు తెలియజేశారు. వరి కోతల అనంతరం పొలంలో మిగిలిన కొయ్యలకు, నిప్పు పెట్టి కాల్చి బూడిద చేయడం వల్ల,రైతుకు ఏ మాత్రం ప్రయోజనం ఉండదని, దీని వల్ల భూమి విపరీతంగా వేడెక్కి భూమి యొక్క సారం కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. పంటలకు మేలు చేసే మిత్ర పురుగులు కూడా మరణిస్తాయని, దీని వల్ల పంట దిగుబడి తగ్గే అవకాశం లేకపోలేదని, రైతులు ఈ విషయాన్ని గమనించాలని అన్నారు.