ఎమ్మెల్సీ ఎన్నికలు, గ్రూపు-1 పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు..

– ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు…
– ఫ్లైయింగ్ స్క్వాడ్ పర్యవేక్షణ కొనసాగించాలి…
– గ్రూప్-1 పరీక్షలకు 9744 మంది..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
ఈనెల 27వ తేదీన జరగనున్న వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రులపై ఎన్నికకు అలాగే జూన్ 9న జరిగే గ్రూపు-1 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు తెలిపారు.గురువారం కలెక్టరేట్ కార్యాలయంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో నోడల్ అధికారులు, తాసిల్దారులు, ఆర్డీవోలు, జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో జిల్లా ఎస్పి  రాహుల్ హెగ్డే ,జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీ సిహెచ్ ప్రియాంకతో కలిసి కలెక్టర్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ నిర్వహణపై అధికారులకు కలెక్టర్ పలు ఆదేశాలు జారీ చేశారు. శాసనమండలి ఎన్నికలకు 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని పట్టభద్రుల ఎన్నికల నిర్వహణకు 142 జంబో బ్యాలెట్ బాక్సులు శ్రీ సత్య సాయి జిల్లా నుండి తెప్పించడం జరుగుతుందని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల గాను   సూర్యాపేటలో 31 పోలింగ్ కేంద్రాలు, కోదాడలో 22 పోలింగ్ కేంద్రాలు , హుజూర్నగర్లో 18 పోలింగ్ కేంద్రాలు మొత్తం 71 పోలింగ్ కేంద్రాలలో అని ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో మొత్తం 51,497 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని తెలిపారు.  ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని తెలిపారు.(ఎఫ్ ఎస్ టి) ఫ్లయింగ్ స్క్వాడ్ పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. పోలింగ్ సిబ్బందికి మాస్టర్ ట్రైనర్ల చే సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు.జూన్ 9వ తేదీన జరిగే గ్రూప్-1 పరీక్షలకు జిల్లాలో 40 సెంటర్లలలొ నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
9,744 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారని కలెక్టర్ తెలిపారు. వీరికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. జిల్లా ఎస్పీ రాహుల్ అంటే మాట్లాడుతూ జిల్లాలో జరిగే గ్రూప్ -1 పరీక్షలకు అన్ని కేంద్రాలలో బందోబస్తుకు పోలీసు సిబ్బందిని కేటాయించినట్లు తెలిపారు పరీక్ష కేంద్రాలలోకి మొబైల్ ఫోన్స్ అనుమతి లేదని ,అన్ని కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఆర్టీసీ, విద్యుత్ శాఖ, రోడ్లు భవనాల శాఖ, తమ పూర్తి సహకారం అందించాలన్నారు.పట్టబద్రుల ఎన్నికలలో ఎఫ్ఎస్టిలు పనిచేస్తాయని ఈ ఎన్నికలకు జిల్లా ఫోర్స్ నె ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ నోడల్ ఆఫీసర్ వివి అప్పారావు ,బ్యాలెట్ బాక్సెస్ నోడల్ ఆఫీసర్ డిపిఓ సురేష్ కుమార్, ట్రైనింగ్ మేనేజ్మెంట్ నోడల్ ఆఫీసర్ శ్రీధర్ రెడ్డి ,పోస్టల్ బ్యాలెట్ నోడల్ ఆఫీసర్ మత్స్య శాఖ అధికారి రూపేందర్ సింగ్, వెహికల్, ట్రాన్స్పోర్ట్ నోడల్ అధికారి ఆర్టిఓ సురేష్ రెడ్డి ,ఎంసీసీ నోడల్ ఆఫీసర్ డిఎఫ్ఓ వి సతీష్ కుమార్, ఎక్స్పెండిచర్ మానిటరింగ్ నోడల్ ఆఫీసర్ ఎస్ పద్మ, ఎంసీఎంసీ నోడల్ ఆఫీసర్ డిపిఆర్ఓ  ఏ రమేష్ కుమార్, ఎలక్ట్రో రోల్స్ మోడల్ ఆఫీసర్ శ్యాంసుందర్ ప్రసాద్, అబ్జర్వేషన్ మోడల్ ఆఫీసర్ లక్ష్మణ నాయక్, పిడబ్ల్యుడి నోడల్ ఆఫీసర్ వెంకటరమణ ,మాస్టర్ ట్రైనర్స్ వి రమేష్ ,వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు, ఎన్నికల సూపర్డెంట్ శ్రీనివాసరాజు, వేణు, రమేష్ ,గ్రూప్ వన్ పరీక్షల సూపరిండెంట్ పద్మారావు ,కలెక్టరేట్ ఏవో మందాడి సుదర్శన్ రెడ్డి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.