
– ఇప్పటికే గ్రామాలలో తిష్ట వేసిన వైనం
– సర్పంచ్ల రిజర్వేషన్లపై కనిపించని స్పష్టత
– పాత పద్ధతినే కొనసాగిస్తారా..?
– ఆశావాహుల్లో నెలకొన్న అయోమయం
– ఆశావాహుల్లో నెలకొన్న అయోమయం
– ఏ ఊరికి ఏ రిజర్వేషన్ వస్తుందోనని ఆందోళన
నవతెలంగాణ – చండూరు
త్వరలోనే గ్రామాలలో పంచాయతీ ఎన్నికల సందడి కొనసాగుతుందని జోరుగా చర్చ జరుగుతుంది. పంచాయతీ ఎన్నికల సమరం ఎప్పుడెప్పుడని ఆశావహులు ఎదురుచూస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల దృశ్య ఇప్పటికే చండూర్ , గట్టుప్పల్ మండల పరిధిలోని అన్ని గ్రామాలలో ఆశావహులు తిష్ట వేసి పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికలు జరగకపోతాయా ‘నేను సర్పంచ్నో.. ఎంపీటీసీనో కాకపోతేనా అనే కొండంత ఆశతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు చేసి ప్రజలతో మమేకమవుతున్నారు. స్థానిక సంస్థల సమరానికి ఆశావాహులంతా సన్నద్ధమవుతున్నారు. పాత పద్ధతిలోనే సర్పంచుల ఎన్నికలు జరుగుతాయా… రిజర్వేషన్ మారుతుందా అని పలువురు అను కుంటున్నారు. రిజర్వేషన్ల మార్పుపై ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. గ్రామాల్లో స్థానికంగా ఉన్న కొంతమంది రాజకీయ నాయకులు ఈసారి ఊరికి సర్పంచ్వి నువ్వే, ఎంపీటీసీవి నువ్వే అని ప్రగల్బాలు పలుకుతున్నారు. ఈసారి మాత్రం ఎంత ఖర్చైనా సర్పంచ్, ఎంపీటీసీ గెలిచి తీరాల్సిందేనని ఆశావాహుల్లో ఆలోచన బలంగా నాటుకపోయింది. ఇది ఇలా ఉంటే ఏ ఊరికి ఏ రిజర్వేషన్ వస్తుందోనని పలువురు ఆశాహవులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి ఆలోచనలకు త్వరలో వెలువడే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్తో తెరపడనుంది.
బీసీలకు 35% రిజర్వేషన్ కల్పించాలి: ఇడం కైలాసం, జిఎంఎస్ఎస్, బిఆర్ఎస్ గట్టుప్పల్ మండల కన్వీనర్
బీసీలకు గత స్థానిక సంస్థల ఎన్నికలలో ఇచ్చిన 25శాతం కాకుండా 35% రిజర్వేషన్లు కల్పించాలి,2018 లో సవరించిన చట్ట ప్రకారం కాకుండా పాత పద్ధతిలో పూర్తి అధికారం సర్పంచ్లకి కేటాయించాలి. జాయింట్ చెక్ పవర్ చెక్ పవర్ పేరుతో సర్పంచులు నానా ఇబ్బందులు పడ్డారు. సర్పంచ్లకు పూర్తి అధికారం ఇస్తేనే గ్రామ అభివృద్ధి జరుగుతుంది, గ్రామ పంచాయతి నిధులను బ్రీజింగ్ చేయరాదు. అధికారుల పెత్తనం ఉండరాదు. గ్రామ పంచాయతిలకు ప్రజా ప్రతినిధులు లేక సమస్యలు పెరిగిపోతున్నాయి. త్వరగా ఎన్నికలు జరపాలి.