
– వెంటాడుతున్న అకాల వర్షాలు
నవతెలంగాణ – మల్హర్ రావు
ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యం అమ్ముకునేందుకు రైతులు అరిగోస పడుతున్నారు.ఎండకు ఎండుతూ,వానకు తడుస్తూ ఇబ్బందులు పడుతున్నారు.అకాల వర్షంతో ధాన్యం తడిసి ముద్దవడంతో బోరుమంటున్నారు.ఎప్పుడు కొనుగోలు చేస్తారోని ఆశగా ఎదురు చూస్తున్నారు.చేతికందిన పంట కళ్ళముందే నెలపాలు కావడంతో గుండెలు బాదేలా విలసిస్తున్నారు.ధాన్యం తడిసి ముద్దవడంతో పంటల కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలోని,పెట్టుబడులైన వస్తాయో.రావోని కలత చెందుతున్నారు. శుక్రవారం మండలంలో తాడిచెర్ల, మల్లారం,పెద్దతూoడ్ల,చిన్నతూoడ్ల,కొండంపేట,రుద్రారం, కొయ్యుర్, వళ్లెంకుంట గ్రామాల్లో కురిసిన వర్షంతో కళ్ళల్లో విక్రయించడానికి పోసిన ధాన్యం కుప్పలు తడిసి ముద్దయ్యాయి.
లక్ష్యం 10 వేల మెట్రిక్ టన్నులు..
మండలంలో యాసంగిలో 13,560 ఎకరాల్లో వరి సాగు చేశారు.ఇందుకు 10,460 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేసి,పిఏసిఎస్ ఆధ్వర్యంలో 11,డిసిఎంఎస్ ఆధ్వర్యంలో 11 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. సన్న రకం తోపాటు దొడ్డు రకం ధాన్యం 200 మెట్రిక్ టన్నుల ధాన్యం ఇప్పటికే ప్రయివేటు వ్యాపారులు సేకరించునట్లుగా సమాచారం.ఇక మిగిలింది.10,260 టన్నులు మాత్రమే.ఇందులో ఇప్పటివరకు 1,500 మెట్రిక్ టన్నులు అధికారులు సేకరించునట్లుగా తెలుస్తోంది.మరో 200 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తోందని చెబుతున్నారు.అయితే మండలంలో రైస్ మిల్లులు లేకపోవడంతో మంథని,పెద్దపల్లి పట్టణాలకు తరలిస్తున్నారు.

ఇటీవల వరుసగా కురుస్తున్న అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో తడిసి ముద్దాయిన,రంగుమారిన, మొలకెత్తిన ధాన్యం ప్రభుత్వం నాణ్యమైన ధరకు కొనుగోలు చేస్తూ, కోతకు ఉన్న పొలాలు నెలకొరిగి నష్టపోయిన రైతులను ఆదుకోవాలి.అకాల వర్షాలతో రైతులకు తీరని నష్టం జరిగింది కావున ప్రభుత్వం ఇస్తామన్న రూ.500 బోనస్ చెల్లించాలి.