క్లాస్మేట్ క్లబ్ ఆధ్వర్యంలో నర్సులకు సన్మానం 

నవతెలంగాణ – అచ్చంపేట 
నర్సుల దినోత్సవ సందర్భంగా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న నర్సులకు అచ్చంపేట క్లాస్మేట క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు పెద్ది మురళి పాల్గొని మాట్లాడారు  నిరుపేదలకు వైద్యం అందించడంలో ఎంతో శ్రమిస్తున్నారని, ఆరోగ్య భవిష్యత్తుకు తోడ్పాటు కల్పిస్తున్నారని అన్నారు  నర్సులు ఆపదలో ఆసుపత్రికి వచ్చే వారిని హక్కున చేర్చుకొని వారికి సరియైన వైద్యం అందించి వారిని సంతోషంగా ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యేవరకు నర్సులు అందించే సేవలను కొనియాడారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న నర్సులను వైద్యులను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో క్లాస్మేట్ క్లబ్ రాష్ట్ర ప్రతినిధులు బంధం పరమేశ్వర ప్రసాద్, కటకం వెంకట్ రాజ్, అచ్చంపేట డివిజన్ ప్రధాన కార్యదర్శి ఓరుగంటి సాయి ప్రసాద్, కోశాధికారి కొట్ర రమేష్,  గోపాల్ నాయక్, పోల సాయిరాం, వైద్యులు డాక్టర్ తరుణ్ కుమార్, నర్సింగ్ సూపరింట్టెడ్ సువర్ణ, మాణిక్యమ్మ, అమీనా బేగం, శ్వేత, చందన, సౌమ్య తదితరులు పాల్గొన్నారు.