నవతెలంగాణ – నెల్లికుదురు
మృతి చెందిన కుటుంబాలను సందర్శించి పరమార్శించినట్లు డాక్టర్ భూక్య మురళి నాయక్ తెలిపాడు. మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు సాలుగు పూర్ణచందర్, మరియు ధూపటి సమ్మయ్య కుటుంబాల సందర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి వారి భౌతిక కాయానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించే కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారు మృతి చెందడం ఎంతో బాధాకరమని అన్నారు వారు గ్రామాలలో ఎంతోమందికి వినలేని సేవలు చేశారని అన్నారు వారి కుటుంబాన్ని అన్ని రంగాలుగా ఆదుకుంటామని ఈ సందర్భంగా హామీ ఇచ్చినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్ మాజీ జెడ్పిటిసి హెచ్ వెంకటేశ్వర్లు మాజీ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయిని సత్యపాల్ రెడ్డి నాయకులు కుమ్మరి కుంట్ల మౌనంగా పులి శ్రీను వారి పల్లి పూర్ణచందర్ వారి పల్లి ఉప్పలయ్య వెన్నం క్రాంతి రెడ్డి శ్రీశైలం యాదవ్ గోగుల మల్లయ్య నెల కుర్తి వెంకటరెడ్డి తో పటు జిల్లా మండల నాయకులు పాల్గొన్నారు.