నవతెలంగాణ – భువనగిరి
యాదాద్రి భువనగిరి జిల్లాలో గురువారం రాత్రి అకస్మికంగా కురిసిన వర్షంతో జిల్లా వ్యాప్తంగా ఐకెపి సెంటర్ల వద్ద ఉన్న ధాన్యం 40 శాతం మేరకు తడిసిపోయింది కొన్ని ప్రాంతాల్లో ధాన్యం కొట్టుకపోయింది అకాల వర్షం ఒక కారణమైతే ప్రభుత్వము పది రోజులుగా ఐకెపి సెంటర్ నుండి ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం మరో కారణం. రెండు రోజులుగా వివిధ ప్రాంతాల్లో సీపీఐ(ఎం) ,ఇతర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం సమావేశాలకు పరిమితమైంది. కానీ సమస్యలు పరిష్కరించలేదు.

జిల్లా వ్యాప్తంగా సీపీఐ(ఎం) ఆందోళన.
గురువారం కురిసిన వర్షంతో తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కోరుతూ శుక్రవారం సిపిఎం ఆధ్వర్యంలో భువనగిరి జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండలాలలో ఐకెపి సెంటర్ల వద్ద తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు.ఆయా మండల తహసిల్దార్ కు వినతి పత్రాలు అందజేశారు..వెంటనే కొనుగోలు చేయాలని నిరసన కార్యక్రమం చేపట్టారు.
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి..
సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ మాట్లాడుతూ సుమారు 20 రోజుల నుండి ఐకెపి కేంద్రాలనుండి కొనుగోలు చేయడం లేదని తెలిపారు. నామమాత్రంగా కొనుగోలు చేసిన దానిని వెరివెంటనే గోదాంలకు తరలించకపోవడంతో ఈ సమస్య జటిలమైనదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎగుమతి చేయడంతో పాటు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. దూడల శేఖర్ శారజీపేట ఆలేరు 5ఎకరాలు నాటు వేశారు 2ఎకరాలు ఎండిపోయిoది 3 ఎకరాలు పరింది 170 బస్తాలు వచ్చింది 30మంది రైతులు ధాన్యం నానింది బత్తుల కొండల్ రెడ్డి శారజీపేట పి ఎ సి ఎస్ 20 రోజులు అవుతుంది