తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తారు: సల్మాన్ రెడ్డి

– ప్రతిపక్ష పార్టీలు ధాన్యం కొనుగోలులో రాజకీయం..
నవతెలంగాణ – వేములవాడ 
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తారు..ప్రతిపక్ష పార్టీలు ధాన్యం కొనుగోలులో రాజకీయం  చేస్తున్నారు..రైతులు ఎవరు అధైర్య పడవద్దని, చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని ఫ్యాక్స్ చైర్మన్ సల్మాన్ రెడ్డి అన్నారు.శుక్రవారం వేములవాడ అర్బన్ మండలం అనుపురం గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేస్తారని వెల్లడించారు. ఇప్పటికే ఫ్యాక్స్ పరిధిలో దాదాపు కొనుగోలు పూర్తయిందని ఇప్పుడు కొనుగోలు ప్రక్రియ చివరి దశలో ఉందన్నారు. ఇప్పటివరకు సుమారుగా 25 లారీలపైనే ధాన్యం బస్తాలు వెళ్లాయని తెలిపారు. కొందరు వ్యక్తులు కావాలని ధాన్యం కొనుగోలు పై రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.వర్షం వల్ల తడిసిన ధాన్యాన్ని కూడా కొనడం జరుగుతుందని రైతులెవరు కూడా అధైర్య పడకుండా ఉండాలన్నారు.  ప్రతిపక్షాలు  కొనుగోలు విషయాల్లో రాజకీయాలు చేస్తున్నారని అనవసర రాజకీయాలు చేయడం మానుకోవాలన్నారు. డిసిఓ బుద్ధ నాయక్ కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు, రైతులు ఎవరు కూడా ఆందోళన చెందకూడదని, ప్రతి గింజ కొంటామన్నారు. ఈ కార్యక్రమంలో భారతి, ఎర్రం రాజు, నాగరాజు, కాస శ్రీను ,జడల రవి, ఎర్రం ఆగయ్య, ఇట్ల శీను, శేఖర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.