భారతదేశ చరిత్ర – సాంస్కృతిక వారసత్వం

ప్రశ్న. 1. తెలంగాణ ప్రాంత చరిత్ర పూర్వయుగానికి సంబంధించి ఈ క్రింది వాటిలో సరికాని వ్యాఖ్యలను గుర్తించండి.
1. ఏలేశ్వరం, అసిఫాబాద్‌, బాసర ప్రాంతాలలో మధ్య శిలాయుగానికి చెందిన కృత్రిమ గృహ ఆనవాళ్ళు లభ్యమయ్యాయి.
2. హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రాంతంలో జంతు రూపంతో చేసిన అస్థికల కుండ (సార్కోఫాగస్‌)లు లభించాయి.
3. మెదక్‌ జిల్లా రిమ్మనగూడెం ప్రాంతంలో తామ్రశిలాయుగంకు చెందిన రాగి ఖడ్గాలు బయల్పడ్డాయి.
4. నవీన శిలాయుగం పని ముట్లు ఇజా(గద్వాల), కదంబాపూర్‌(పెద్దపల్లి), చిన్న మారూరు(నాగర్‌కర్నూల్‌) ప్రాంతాలలో లభించాయి.
ఎ. 1,2 మాత్రమే బి. 1 మాత్రమే సి. 2 మాత్రమే డి. 2,4 మాత్రమే
ప్రశ్న. 2. నాగార్జున కొండలో బయటపడిన సంస్కృతికి సంబంధించి ఈ క్రింది వాటిలో సరికాని వ్యాఖ్యాలను గుర్తించండి.
1. బుద్ధుని ధాతువును నిక్షిప్తం చేసిన మహాచైత్యవిహారం బయటపడింది.
2. అష్టభుజస్వామి అనబడే వైష్ణవ దేవాలయం నిర్మించబడింది.
3. రాజు పట్టాభిషేక మహౌత్సవ శిల్పం లభించింది.
4. నాగార్జున కొండ ప్రాంతానికి శ్రీ పర్వతం అనే పేరు కూడా ఉంది.
ఎ. 1 మాత్రమే బి. 2 మాత్రమే సి. 3 మాత్రమే డి. 4 మాత్రమే
ప్రశ్న. 3. ఈ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి.
1. అస్మత రాజ్యం షోడషమహాజనపదాలకు సంబంధించి దక్షిణాపథంలో ఉన్న ఏకైక రాజ్యం
2. ప్రస్తుత దక్షిణ కర్ణాటక, వాయువ్య తమిళనాడు ప్రాంతాలు అస్మక రాజ్యంలో అంతర్భాగాలు
3. అస్మక రాజ్యం గోదావరి, మంజీర నదీ పరివాహక ప్రాంతాల్లో విలసిల్లింది.
4. బౌద్ధ గ్రంథం అయిన అంగుత్తరనికయలో అస్మక రాజ్యం గురించిన ప్రస్తావన ఉంది.
ఎ. 1,2 మాత్రమే బి. 2,3,4 మాత్రమే సి.1,3,4 మాత్రమే డి. 1,2,4 మాత్రమే
ప్రశ్న.4. శాతవాహనుల శాసనాల్లో ప్రస్తావించిన వివిధ వృత్తుల వారిని, వారు చేసిన పనులను జతపరచండి.
ఎ.కోలిక 1. నూనె గానుక ఆడించువాడు
బి.కులారి 2. వ్యవసాయదారుడు
సి.తిల పిష్ఠక 3. కుమ్మరివాడు
డి.హాలిక 4. నేతపనివాడు
ఎ.ఎ-3, బి-4, సి-2, డి-1 బి. ఎ-4, బి-3, సి-1, డి-2
సి.ఎ-1, బి-3, సి-4, డి-2 డి. ఎ-3, బి-2, సి-4, డి-1
ప్రశ్న.5 ఆలంపూర్‌లో బయటపడిన ప్రాచీన దేవాలయాలకు సంబంధించిన ఈ క్రింది వ్యాఖ్యలలో సరైనవి గుర్తించండి.
1. మొదటి విక్రమాదిత్యుని రాణి శాసనం గరుడ బ్రహ్మాశ్వరాయలంలో లభించింది.
2. ముఖ్యమైన ఆలయాలన్నీ బాదామి చాళుక్యుల కాలంలో నిర్మించబడ్డాయి.
3. ఆలంపూర్‌ పాశుపతశైవానికి చెందిన పుణ్యక్షేత్రం
4. రాష్ట్ర కూటమి కాలంలో నరసింహ, సూర్యనారాయణ స్వామి ఆలయాలు నిర్మించారు.
ఎ. 1,2,3 మాత్రమే బి. 2,4 మాత్రమే సి. 3,4 మాత్రమే డి. 1,2,3,4
ప్రశ్న 6. ఈ క్రింద పేర్కొన్న వాటిలో గౌతమ బుద్ధుడు బోధించిన దు:ఖానికి హేతువులను గుర్తించండి.
1. మానవులు అనంతమైన కోరికలు కలిగి ఉండడం
2. మానవులు స్వభావరీత్యా దు:ఖజీవులు
3. మానవులు మనోనిగ్రహం లేకపోవడం
ఎ.1 మాత్రమే బి.2,3 మాత్రమే సి.1,2,3 డి.ఏదీకాదు
ప్రశ్న 7. ఈ క్రింది వాటిని జతపర్చండి.
ఎ.పంపన 1.కుర్మ్యాల శాసనం
బి.జనవల్లభుడు 2. కవి జనాశ్రయం
సి. రేచర్ల రుద్రుడు 3. ఆది పురాణం
డి. మల్లియ రేచన 4. రామప్ప దేవాలయం
ఎ.ఎ-4, బి-2, సి-1, డి-3 బి.ఎ-3, బి-1, సి-4, డి-2
సి.ఎ-3, బి-1, సి-4, డి-2 డి.ఎ-2, బి-3, సి-4, డి-1
ప్రశ్న 8. మధ్యయుగ కాలంలో భారతదేశంలోకి విదేశీయుల ద్వారా ప్రవేశపెట్ట బడిన ఆహార పదార్థాలను గుర్తించండి.
1.బంగాళదుంప 2.మిరపకాయ 3.వేరుశనగ 4.టమాట 5.మొక్కజొన్న
ఎ. 1,2,3 మాత్రమే బి.2,4,5 మాత్రమే సి.1,2,3,4 మాత్రమే డి.1,2,3,4,5
ప్రశ్న.9. ఢిల్లీ సుల్తానుల కాలానికి సంబంధించి ఈ క్రింది పరిపాలనా విభాగాలను పరిశీలించండి.
1.దివాన్‌-ఇ-అరిజ్‌ – సైనికశాఖ
2.దివాన్‌-ఇ-భైతర్‌ – దేవాదాయ, ధర్మాదాయశాఖ
3.దివాన్‌-ఇ-రియాసత్‌ – వ్యాపార, వాణిజ్యాల శాఖ
4.దివాన్‌-ఇ-ముస్తఖరజ్‌ – పన్ను చెల్లింపుల శాఖ
పై వాటిలో ఏవేవి సరిగ్గా జత పర్చబడ్డాయి?
ఎ.1 మాత్రమే బి. 1,2,3,4 సి.1,2,3 మాత్రమే డి.2,4 మాత్రమే
ప్రశ్న.10. ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలించి సరికానివి గుర్తించండి.
1. కాకతీయుల తొలి రాజచిహ్నం గరుడ లాంఛనం
2. క్రీడాభిరామం తెలుగులో రాసిన తొలి నాటకం
3. పల్నాటి యుద్ధంలో నలగామ రాజుకు సహాయపడ్డ కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు
4. కాకతీయుల కాలంలో నాయంకర విధానాన్ని ప్రవేశపెట్టినది రుద్రమదేవి
ఎ. 1,2 మాత్రమే బి.3,4 మాత్రమే సి.4 మాత్రమే డి.3 మాత్రమే
ప్రశ్న.11. కాకతీయుల ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఈ క్రింది వ్యాఖ్యలలో సరైనవి గుర్తించండి.
1. వ్యాపార సంఘాలను శ్రేణి లేదా సమయము అని పిలిచేవారు
2. చెరువులను సప్త సంతానాలలో భాగంగా గుర్తించేవారు
3. భూమిశిస్తును ధాన్య రూపంలో చెల్లిస్తే ‘పుట్టి కుంచం’ అని, ధన రూపంలో చెల్లిస్తే ‘పుట్టి మాడలు’ అని పిలిచేవారు.
4. చైనా, మధ్య ఆసియా, ఆగేయ ఆసియా, బర్మా, శ్రీలంక దేశాలతో విదేశీ వాణిజ్యం చేసేవారు.
ఎ.1,2,3,4 బి.2,3,4 మాత్రమే సి.1,3,4 మాత్రమే డి.1,2,4 మాత్రమే
ప్రశ్న.12. క్రింద పేర్కొన్న కడపటి మొగలులను వారి, వారి పాలనా కాలాలను అనుసరించి సరైన వరుస క్రమంలో రాయండి.
1.మొదటి షా ఆలమ్‌ 2.జహందర్‌ షా 3.ఫరుక్‌సియార్‌ 4.మహమ్మద్‌ షా రంగీలా
ఎ.1,2,3,4 బి.4,3,2,1 సి.3,1,2,4 డి.2,1,4,3
ప్రశ్న.13. ఈ క్రింద పేర్కొన్న వాటిలో విజయనగర సామ్రాజ్యానికి, బహమనీ సుల్తానులకు జరిగిన యుద్ధాలకు గల ప్రధాన కారణాలను గుర్తించండి.
1. కృష్ణా-గోదావరి పరివాహక ప్రాంతాలపై ఆధిపత్యం కోసం
2. కృష్ణా-తుంగభద్ర నదుల మధ్య ప్రాంతాలపై ఆధిపత్యం కోసం
3. మారాఠా ప్రాంతంలోని కొంకణ తీరంపై పట్టుకోసం
4. హిందూ-ముస్లింల మధ్య ఉండే సహజసిద్ధ ఘర్షణలు
ఎ.1,2 మాత్రమే బి.1,2,3 మాత్రమే సి.2,4 మాత్రమే డి.4 మాత్రమే
ప్రశ్న.14. ఈ క్రింది వాటిని జత పర్చండి
ఎ.కుతుబ్‌-ఉల్‌-ముల్క్‌ 1.హైదరాబాద్‌ నగర ప్రధాన వాస్తుశిల్పి
బి.మహమ్మద్‌ కులీకుతుబ్‌షా 2.కుతుబ్‌షాహీల వంశమూల పురుషుడు
సి.అబుల్‌ హసన్‌ తానీషా 3.హైదరాబాద్‌ రాజ్యంలో డచ్‌, ఆంగ్లేయుల స్థావరాల ఏర్పాటు
డి.మీర్‌మొహమ్మద్‌ మోమీన్‌ 4. మొగలు సామ్రాజ్యంలో గోల్కొండ అస్త్రాబాది విలీనం
ఎ.ఎ-2, బి-3, సి-4, డి-1 బి.ఎ-1, బి-2, సి-3, డి-4
సి.ఎ-4, బి-2, సి-3, డి-1 డి.ఎ-3, బి-4, సి-2, డి-1
ప్రశ్న.15. ఈ క్రింది వ్యాఖ్యలలో సరికాని దానిని గుర్తించండి
1. హైదరాబాద్‌ కంటింజెంట్‌ మిలటరీ దళాల పోషణ కోసం నిజాం ప్రభుత్వం బేరార్‌ ప్రాంతాన్ని బ్రిటిషన వారికి అప్పగించింది.
2. హైదరాబాద్‌ రాష్ట్రంలో పర్షియన్‌ స్థానంలో ఉర్దూ అధికార భాషగా ప్రవేశపెట్టిన సంవత్సరం 1884
3. హైదరాబాద్‌ స్వదేశీలీగ్‌ను స్థాపించినది సరోజినినాయుడు
4. నిజాంకాలేజ్‌ పూర్వనామం జాగిర్దార్‌ కాలేజ్‌
ఎ.1,2 మాత్రమే బి.1,3 మాత్రమే సి.2,4 మాత్రమే బి.3,4 మాత్రమే
ప్రశ్న:16. సహాయ నిరాకరణ ఉద్యమాని(1920)కి సంబంధించి ఈ క్రింది వాటిలో సరికాని వ్యాఖ్యలను గుర్తించండి.
1. జలియన్‌వాలాబాగ్‌ ఉదంత తర్వాత గాంధీ తన కైసరే-ఎ-హిద్‌ బిరుదును వదులుకున్నాడు
2. జామియా మిలియా, కాశీ విద్యాపీఠం వంటి జాతీయ విద్యా సంస్థలు స్థాపించబడ్డాయి.
3. మహమ్మద్‌ ఆలీ జిన్నా, సరేంద్రనాథ్‌ బెనర్జీ వంటి అనేక మంది న్యాయవాదులు వారి, వారి వృత్తులను త్యజించారు.
4. భారత జాతీయ కాంగ్రెస్‌ పార్టీ తోట పరిశ్రమ యాజమాన్య సంఘాలకు మద్దతు తెలిపిన కారణంగా తోట పరిశ్రమల కార్మికులు ఉద్యమంలో పాల్గొన లేదు.
ఎ.1,2 మాత్రమే బి.2,3 మాత్రమే సి.3,4 మాత్రమే డి.2,4 మాత్రమే
ప్రశ్న.17. భారత జాతీయ కాంగ్రెస్‌ 1931వ సంవత్సరం కరాచీలో నిర్వహించిన సమావేశానికి సంబంధించి సరైన వ్యాఖ్యలను గుర్తించండి.
1.సమావేశానికి సర్దార్‌ వల్లభారు పటేల్‌ అధ్యక్షత వహించారు.
2.జాతీయ ఆర్థిక ప్రణాళిక, ప్రాథమిక హక్కులు అనే రెండు కీలక అంశాలపై తీర్మానాలు చేసారు.
ఎ.1 మాత్రమే బి. 2 మాత్రమే సి.1,2 మాత్రమే డి. రెండూ సరైనవి కావు
ప్రశ్న.18. భారతదేశంలో నెలకొన్న పరిశ్రమలకు సంబంధించి ఈ క్రింద పేర్కొన్న వ్యాఖ్యలలో సరైన దానికి గుర్తించండి.
1. మొదటి చక్కెర పరిశ్రమ 1903 సం||లో బెంగాల్‌లోని రాష్ట్ర ప్రాంతంలో నెలకొల్పారు.
2. మొదటి నూలు పరిశ్రమ 1854 సం||లో కోవాస్‌జీ నానాభారు దబేర్‌ ద్వారా బొంబాయిలో నెలకొల్పబడింది.
3. రెండవ ప్రపంచయుద్ధ ప్రారంభం నాటికి జె.ఎన్‌.టాటా స్థాపించిన టిఐఎస్‌సిఓ బ్రిటిష్‌ సామ్రాజ్యంలో అతిపెద్ద స్టీల్‌ పరిశ్రమగా అభివృద్ధి చెందింది.
ఎ.1,2 మాత్రమే బి.2,3 మాత్రమే సి.1,3 మాత్రమే డి.1,2,3 మాత్రమే
ప్రశ్న.19. ఇల్బర్ట్‌ బిల్‌ వాదానికి సంబంధించి ఈక్రింది వ్యాఖ్యలలో సరైన దానిని గుర్తించండి.
1. లార్డ్‌ రిపన్‌ కాలంలో వైస్రారు కౌన్సిల్‌లోని లామెంబర్‌ అయిన సర్‌ సి.పి.ఇల్బర్ట్‌ ఈ బిల్‌ను ప్రవేశపెట్టాడు.
2. ఈ అంశంపై లార్డ్‌రిహన్‌కు బ్రిటిష్‌ మహరాణి మద్దతు లభించింది.
3. బిల్‌కు చేసిన సవరణ ప్రకారం భారతీయ జడ్జిలు యూరోపియన్‌లను విచారించాలంటే 50శాతం యూరోపియన్‌ జ్యూరీ సభ్యుల మద్దతు అవసరం
ఎ.1,3 మాత్రమే సి.1 మాత్రమే సి.1,2,3 మాత్రమే డి.1,2 మాత్రమే
ప్రశ్న.20.భారత జాతీయ ఉద్యమానికి సంబంధించి ఈ క్రింది వ్యాఖ్యలలో సరైన దానిని గుర్తించండి.
1. దేశంలో ప్రజాస్వామ్య విలువలు, వ్యవస్థలకు జాతీయ ఉద్యమం ప్రాచుర్యం కల్పించింది.
2. ప్రజాస్వామ్య సిద్థాంతాల భూమికగా నిర్మితమైన పార్లమెంటరీ తరహా విధానాలను భారత జాతీయ కాంగ్రెస్‌ సమర్థించింది.
3. జాతీయ ఉద్యమం కేవలం స్వాతంత్య్రం కోసమే కాకుండా ఆర్థిక అభివృద్ధి కోసం కూడా జరిగిన ఉద్యమం
4. విభిన్న రాజకీయ సిద్ధాంతాలు కలిగిన వారి హక్కులకై పోరాడడంలో జాతీయ ఉద్యమం విఫలమైంది.
ఎ.1,2,3,4 బి.1,2,4 మాత్రమే సి.1,3,4 మాత్రమే డి.1,2,3 మాత్రమే
21.తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించి ఈక్రింది వ్యాఖ్యలలో సరైనవి గుర్తించండి.
1. ‘నిజాం రాజ్యం ప్రజల బంధిఖానా’ అని వ్యాఖ్యానించింది మఖ్దూం మొహియిద్దీన్‌
2. ‘మా నిజాం రాజు తరతరాల బూజు’ అని దాశరథి కృష్ణమాచార్యులు నినదించారు
3. ‘బండెనక బండి కట్టి’ పాట రచయిత బండి యాదగిరి
4. ‘తెలంగాణ’ అనే ఉర్దూ కవిత రాసిన వ్యక్తి నవాబ్‌ తురబ్‌యార్‌జింగ్‌
ఎ.1,2 మాత్రమే బి.1,2,3 మాత్రమే సి.3 మాత్రమే డి.3,4 మాత్రమే
ప్రశ్న:22. ఈక్రింది వాటిలో సరికాని వ్యాఖ్యలను గుర్తించండి
1. నిజాం రాజ్యంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరిపేందుకు జవహర్‌లాల్‌ నెహ్రూ స్వయంగా త్రివర్ణ పతకాన్ని రావినారాయణరెడ్డికి అందజేశారు.
2. భారత ప్రభుత్వం నిజాం ప్రభువును రాజ్‌ప్రముఖ్‌ పదవితో సత్కరించింది.
3. భూదాన ఉద్యమాన్ని వినోబాభావే ప్రారంభించారు.
4. ఆంగ్లేయులు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు మద్దతునిచ్చారు.
ఎ.1,4 మాత్రమే బి.2,3 మాత్రమే సి.1,2 మాత్రమే డి.2,4 మాత్రమే
ప్రశ్న:23. ఈక్రింది వాటిని జతపర్చండి
ఎ.కొండపల్లి సీతారామయ్య 1.పిలుపు పత్రిక
బి.సురవరం ప్రతాపరెడ్డి 2.హైదరాబాద్‌ పత్రిక
సి.పెండ్యాల వరవరరావు 3.గోల్కొండ పత్రిక
డి.మాడపాటి రామచంద్రరావు 4.సృజన పత్రిక
ఎ.ఎ-4, బి-3, సి-2, డి-1 బి.ఎ-1, బి-3, సి-4, డి-2
సి.ఎ-1, బి-2, సి-3, డి-4 డి.ఎ-4, బి-3, సి-2, డి-1
ప్రశ్న:24. తెలంగాణ సంస్కృతికి సంబంధించి ఈ క్రింది వ్యాఖ్యలలో సరైనవి గుర్తించండి
1. బతుకమ్మ పండుగను ఆషాడ మాసంలో జరుపుకుంటారు.
2. తుల్జా భవాని జాతరను ప్రధానంగా గోండులు జరుపుకుంటారు.
3. స్త్రీలు చేసే పేరిణి నృత్యాన్ని ‘లాస్యం’ అంటారు.
4.’యక్షగానం’ అనేది ఒక సంగీత వాయిద్యం
ఎ.1 మాత్రమే బి.2 మాత్రమే సి. 3 మాత్రమే డి. 4 మాత్రమే
ప్రశ్న:25. తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఈ క్రింద పేర్కొన్న ఘటనలు, సంస్థల ఏర్పాటును కాలానుక్రమ పద్ధతిలో పేర్చండి
1. KTPS ఆందోళన 2.తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు
3. ‘ఓ.యు.ఫోరం ఫర్‌ తెలంగాణ’ ఆవిర్భావం
4. ‘తెలంగాణ జన సభ’ ఏర్పాటు 5. ‘తెలంగాణ ముక్తి మోర్చ’ ఏర్పాటు
ఎ.1,2,3,4,5 బి.1,4,3,2,5
సి.5,4,3,2,1 డి.1,4,3,5,2

సమాధానాలు

1. సి 2. సి 3. సి 4. బి 5. డి 6. ఏ 7. బి 8. డి 9. బి 10. డి 11. ఏ 12. ఏ 13. బి 14. ఏ 15. డి 16. సి 17. సి 18. బి 19. ఏ 20. డి 21. బి 22. ఏ 23. బి 24. సి 25. డి

 

జి.రామ్‌ధన్‌
9949122100
అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ఆఫ్‌ హిస్టరి
తెలంగాణ సారస్వత పరిషత్‌ ఓరింయంటల్‌ కళాశాల