– గుట్టుచప్పుడు కాకుండా తరలింపు
– రెచ్చిపోతున్న అక్రమార్కులు
– గోదాముల నుంచే నఖిలీ కాగితాలతో అక్రమ దందా
– అమ్మ రైస్ మిల్లులో పట్టుబడిన 794 బస్తాల పీ డీ ఎస్ బియ్యం
– పట్టుకున్న ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు పోలీసులు
– పలు రైస్‌మిల్లుల్లోనూ రీసైక్లింగ్ వ్యాపారం
నవతెలంగాణ – పెద్దవూర
రేషన్ బియ్యం గుట్టు చప్పుడు కాకుండా పక్కదారి పడుతున్నది. మిల్లులలోనే రీసైక్లింగ్ చేస్తున్న అక్రమార్కులకు ఈ దందా కాసుల వర్షం కురిపిస్తున్నది.దాంతో వారి వ్యాపారం మూడుపువ్వులు ఆరుకాయలుగా నడుస్తున్నది. నల్గొండ జిల్లా పెద్దవూర,హాలియా లో భారీగా రేషన్ బియ్యం పట్టుబడ్డాయి. మండలం పరిధిలో ని తెప్పల మడుగు స్టేజీ వద్ద అమ్మా రైసు మిల్లులపై దాడులతోపాటు,అక్రమంగా పీడీఎస్ రైస్‌ను తరలిస్తున్న లారీని విజిలెన్స్ అధికారులు శనివారం రాత్రి పట్టుకున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 16 తేదీన మధ్యాహ్నం నల్గొండ పోలీస్ టాస్క్ఫోర్స్ విభాగం వారికీ మరియు పెద్దవూర ఎస్ఐ కి వచ్చిన సమాచారం మేరకు పెద్దవూర మండలం లోని తెప్పలమడుగు గ్రామ శివారులో గల అమ్మ రైస్ మిల్ లో పీడీఎస్ బియ్యం అక్రమ నిల్వ కలిగి వున్నాయని తెలియగా వెంటనే పోలీస్ వారు రైస్ మిల్ వద్దకు వెళ్ళి అందులో తనిఖీ నిర్వహించగా అందులో 749బస్తాల రేషన్ బియ్యం పట్టుబడింది.అట్టి విషయంలో పెద్దవూర పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ నిర్వహించగా ఈ విస్తృత పోయే నిజాలు బయట పడ్డాయి. సివిల్ సప్లై విభాగంలో సరుకుల పంపిణీకు సంబంధించి కాంట్రాక్టర్ గా పని చేస్తున్న కందుల వెంకటరమణ అను అతను మరియు పెద్దవూర మండలం తెప్పలమడుగు గ్రామ శివారులోని అమ్మ రైస్ మిల్ యొక్క ఓనర్ మలిగిరెడ్డి రామానుజ రెడ్డి,సివిల్ సప్లై విభాగంలో స్టేటు కాంట్రాక్టర్లుగా పనిచేస్తున్న బూరుగు శ్రీనివాస్, కుక్కడం రమేష్ కలిసి నల్గొండ లోని బియ్యం గోదాంలో ఔట్సోర్సింగ్ ఎంప్లాయ్ గా పనిచేస్తున్న లింగాల మల్లేష్,శ్రీకాంత్, అను వారితో కలిసి ఒక పథకం ప్రకారం జిల్లా గోదాం నుండి బియ్యం ను
నఖిలీ సర్టిఫికెట్లును సృష్టించి రేషన్ బియ్యం ను లారీల్లో లోడ్ చేసి వాటిని గోదాంకు తరలించకుండా బూరుగు శ్రీనివాసులు వద్ద పనిచేస్తున్న ఎడ్ల ఆంజనేయులు అను అతని లారీలో ఈనెల 15 వ తేదీన ఒక లారీ,16 వ తేదీన రోజున రెండు లారీ లలో నల్గొండ లోని ప్రభుత్వ గోదాం నుంచి నేరుగా పెద్దవూర మండలం లోని అమ్మ రైస్ మిల్ కి తరలించి వాటిని వేరే బ్యాగులలో ప్యాక్ చేసి తిరిగి అవే బియాన్ని ప్రభుత్వంకి అమ్మేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అందుకు మిల్లులో అకౌంటెంట్ గా పని చేస్తున్న వెంపటి సంతోష్ కుమార్, క్యాషియర్ గా పని చేస్తున్న లింగంపల్లి సైదులు ఇద్దరు సహకరించారని తెలిపారు. ఈ నెల 16 వతేదీన బియ్యం నింపుకొని ఎడ్ల ఆంజనేయులు అమ్మ రైస్ మిల్లు వద్దకు రాగా నల్లగొండ టాస్క్ ఫోర్స్ అధికారులు, పెద్దవూర పోలీసులు అట్టి విషయాన్ని తెలుసుకుని పిడిఎస్ బియ్యంను అన్లోడ్ చేస్తుండగా పట్టుకున్నారు. రెండవ లారీని హలియా పోలీస్ లు పట్టుబడి చేయడం జరిగిందని తెలిపారు.ప్రభుత్వం ద్వారా ప్రజలకు వెళ్లవలసిన రేషన్ బియ్యం ను ఒక పథకం ప్రకారం పక్కదోవ పట్టించి అమ్మ రైస్ మిల్లులో పెట్టి మిల్లుకు సంబంధించిన బ్యాగులో తిరిగి వాటిని నింపి వాటిని అమ్ముతూ లాభాలు సాధిస్తూ మోసం చేస్తున్నారు.బియ్యం తరలిస్తున్న లారీ ను, కాగితాలను, అలానే 749 బస్తాల బియ్యం తోపాటు,విడి బియ్యంను స్వాధీనం చేసుకుని పౌర సరఫరా అధికారులకు అప్పగించామని ఎస్ ఐ వీరబాబు తెలిపారు. ఈ విషయమై లింగాల మల్లేష్, వెంపటి సంతోష్ కుమార్, సైదులు, ఎడ్ల ఆంజనేయులు అను వారిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని మిగతావారు పరారీలో ఉన్నట్లు తెలిపారు.ఈ కేసు లోఇంకా ఎవరైనా ఉన్నారా అనే విషయం లో విచారణ చేపడుతున్నట్లు తెలిపారు.