నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
తెలంగాణ రాష్ట్రంలో కులగనన ప్రక్రియ చేపట్టిన తర్వాతే,రిజర్వేషన్ల ప్రకారం రిజర్వేషన్లను 50 శాతానికి పెంచి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సహస్ర ఫౌండేషన్ చైర్మన్ తెలంగాణ రాష్ట్ర హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు చినకాని శివప్రసాద్ ఒక ప్రకటనలో ఆదివారం తెలిపారు. శాసనసభ ఎన్నికల ప్రచారంలో కులగనన చేపడతామని హామీ ఇచ్చినటువంటి తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ అధ్యక్షులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లోక్ సభ ఎన్నికలు ముగియగానే జూన్ చివరి వారంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి న్యాయం కాదని శివప్రసాద్ పేర్కొన్నారు. బీసీ కులగన చేపట్టిన తర్వాత మాత్రమే స్థానిక సంస్థల ఎలక్షన్లు నిర్వహించాలని లేనియెడల పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని సహస్ర ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ చినకని శివప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.