ఆదివారం ఈ చిత్ర టైటిల్ రోల్‌ని పరిచయం చేసే ఫియర్ సాంగ్‌ని చిత్ర బృందం రిలీజ్ చేసింది. అనిరుద్ రవిచంద్రన్ కంపోజ్ చేసిన ఈ పాట దేవరగా ఎన్టీఆర్ పాత్రలోని అన్ని కోణాలను పరిచయం చేసింది. అంతేకాదు భయానికే భయం పుట్టించేలా ఉన్న దేవర క్యారెక్టర్‌కి సర్వత్రా మంచి రెస్పాన్స్ వస్తోందని మేకర్స్ ఆనందం వ్యక్తం చేశారు.
ఎన్టీఆర్ నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రపంచస్థాయిలో బజ్ క్రియేట్ చేస్తున్న సినిమా ఇది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కీ రోల్ చేస్తున్నారు. ఈ సినిమా రెండు పార్టులుగా తెరకెక్కుతోంది. ఫస్ట్ పార్ట్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అక్టోబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంలో చిత్రాన్ని అత్యంత భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమాకు ఇప్పుడు బాలీవుడ్ నుంచి అద్భుతమైన సపోర్ట్ లభించింది. బాలీవుడ్ మేజర్ ప్లేయర్స్ ఈ చిత్రంతో చేతులు కలుపుతున్నారు. ధర్మ ప్రొడక్షన్స్, ఏఏ ఫిల్స్ కలిసి ఈ సినిమాను ఉత్తరాదిన డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు. ఈ చిత్ర నార్త్ థియేట్రికల్ రైట్స్‌ని కరణ్ జోహార్, అనిల్ తండానీ సొంతం చేసుకున్నారు. అత్యంత భారీ మొత్తం చెల్లించి ఈ మాగమ్ ఆపస్‌ని దక్కించుకోవడం విశేషం. ఇప్పటికే విడుదలైన దేవర గ్లింప్స్ సోషల్ మీడియాలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఎన్టీఆర్ రోల్ మీద భీభత్సమైన ఇంట్రస్ట్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో ఆయనతో పాటు ప్రకాష్‌రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, నరేన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో అద్భుతమైన క్రేజ్ తెచ్చుకున్న ఈ చిత్రాన్ని నందమూరి కల్యాణ్ రామ్ సమర్పిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మిక్కిలినేని సుధాకర్, హరికష్ణ.కె. ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ చేస్తున్నారు. ఆర్. రత్నవేల్ సినిమాటోగ్రాఫర్‌గా, ప్రొడక్షన్ డిజైనర్‌గా సాబు సిరిల్ వ్యవహరిస్తున్నారు