
చిన్న నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ రెండు దశాబ్దాల తర్వాత కలుసుకున్న స్నేహితులు ఆనందంగా గడిపారు.తమ స్నేహ బంధాలను గుర్తుకు తెచ్చుకుని సందడి చేశారు.మండల కేంద్రంలోని విజ్ఞాన భారతి విద్యాలయంలో పదో తరగతి విద్యాభ్యాసం చేసిన 2003-2004 సంవత్సరానికి చెందిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. వివిధ రంగాలు,ఉద్యోగాలలో స్థిరపడిన వారంతా 20 సంవత్సరాల తదుపరి ఒక్కచోట చేరారు. తమకు అప్పుడు విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు జ్ఞాపికలు అందజేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఏ ఏ సబ్జెక్టు టీచర్లు ఎలా బోధించారో గుర్తు చేస్తూ తమదైన శైలిలో ప్రసంగించారు.నాడు బోధించిన సంస్కారమే నేడు సమాజంలో రాణిస్తున్నామంటూ ఉపాద్యాయులు చేసిన సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ సత్తు.సుజాత ప్రధానోపాధ్యాయులు సత్తు, మహిపాల్ రెడ్డి, ర్యాకం మల్లేశం, మాలే రమేష్, ఆనంద్, వెంకటేష్, సంతోష్, శేఖర్, పూర్వ విద్యార్థులు సంతోషి, నవిత, శ్రీలత, సి ఎచ్ లావణ్య, ఎస్ .లావణ్య, పావని, స్వప్న, నాగరాజు, రాజు, రాజేశం, విజయ్,సాగర్, జనార్దన్ రెడ్డి , నరసింహ రెడ్డి, యాదగిరి, నరేష్ రెడ్డి,వెంకటేష్, సంపత్, షహిన్షా తో పాటు తదితరులు పాల్గొన్నారు.