– 100వంద శాతం పన్నులు వసుళ్లు..
– పంచాయతీ కార్యదర్శులను అభినందించిన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు
– గ్రామాభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర కీలకం
నవతెలంగాణ-కొత్తూరు
పన్నుల వసూళ్లలో గిరిజన తండాలు ఆదర్శంగా నిలిచాయి. గ్రామ పంచాయతీల్లో పన్నుల ద్వారా వచ్చే నిధులు గ్రామ అభివృద్ధికి ఎంతో తోడ్పాటునందిస్తాయి. ఇంటి పన్ను, వృత్తి వ్యాపార లైసెన్సు రెన్యువల్ పన్ను, ఆస్తి మార్పిడి పన్ను లాంటి వివిధ పన్ను రూపంలో గ్రామ పంచాయతీలకు ఆదాయం లభిస్తుంది. పంచాయతీ సిబ్బంది ప్రతి యేటా పన్నులు వసూళ్లు చేసి గ్రామ అవసరాలకు ఉపయోగిస్తుంటారు. మండలంలోని వివిధ గ్రామాలలో 2003-24 ఆర్థిక సంవ త్సరానికి గాను రూ.73 లక్షల 93 వేల 215లు పన్నుల రూపంలో రావాల్సి ఉండగా రూ.67 లక్షల 54 వేల 967లు వసూళ్లు అయ్యాయి. మండలాన్ని యూనిట్‌గా తీసుకుంటే 91శాతం పన్నులు వసూళ్లు అయ్యాయి. ఏనుగు మడుగుతండా, కొడిచర్లతండా, మల్లాపూర్‌తండా, మల్లాపూర్, శేరిగూడ భద్రయ్య పల్లి గ్రామపంచాయతీలో 100శాతం పన్ను వసూళ్లు అయ్యాయి. గూడూరు గ్రామపం చాయతీలో 91శాతం, ఇముల్నర్వా గ్రామపంచా యతీలో 90 శాతం, కొడిచెర్ల గ్రామ పంచాయతీలో 40 శాతం, మక్తగూడ గ్రామ పంచాయతీలో 95 శాతం, పెంజర్ల గ్రామ పంచాయతీలో 92 శాతం, సిద్దాపూర్ గ్రామపంచా యతీలో 80 శాతం, తీగపూర్ గ్రామపంచాయతీలో 85శాతం పన్నులు వసూళ్లుఅయ్యాయి. గత శని వారం జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో 100 శాతం పన్నులు వసూళ్లు చేసిన పంచాయతీ కార్య దర్శులను, ప్రజాప్రతినిధులు, ఉన్నతా ధికారులు అభినందించారు.