కల్తీ మందులు.. కల్తీ విత్తనాలను అరికట్టాలి: వ్యవసాయ కార్మిక సంఘం

– అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా
నవతెలంగాణ – రెంజల్
రాష్ట్రంలో రాబోవు ఖరీఫ్ సీజన్ పురస్కరించుకొని కల్తీ మందులు, కల్తీ విత్తనాలను ప్రభుత్వం అరికట్టాలని, రెండు లక్షల రూపాయలు వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ, మంగళవారం తాసిల్దార్ కార్యాల యం ఎదుట అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ, కార్మిక సంఘం నాయకులు ధర్నా నిర్వహించి ఇంచార్జ్ తహసిల్దార్ శ్రావణ్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసును అమలు చేయాలని, కొత్తగా ప్రకటించిన పించను 4016 రూపాయలను వెంటనే అమలు చేయాలని, కొత్తగా రేషన్ కార్డు కోసం దరఖాస్తులు చేసుకున్న వారందరికీ నూతన కార్డులను మంజూరు చేయాలని, రైతులకు 500 రూపాయల బోనస్ ప్రకటించాలని, ఇల్లు లేని నిరుపేదల అందరికీ పది లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ సంఘం జిల్లా నాయకులు పుట్టి నడిపి నాగన్న, కార్మిక సంఘం జిల్లా నాయకులు పార్వతి రాజేశ్వర్, అఖిల భారత ప్రగతిశీల కార్మిక సంఘం మండల అధ్యక్షులు వడ్డెన్న, కార్యదర్శి ఎస్కె నసీర్, అఖిలభారత ప్రగతిశీల రైతు సంఘం మండల అధ్యక్షులు మిద్దె పెద్దులు, నాయకులు గోపాల్, సిద్ధ పోశెట్టి, తరుణ్ ,లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.