
ఆయిల్ ఫాం సాగు దారులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలంగాణ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య డిమాండ్ చేసారు. ఏఐకేఎస్ రాష్ట్ర విస్త్రుత సమావేశం మంగళవారం హైద్రాబాద్ సంఘం రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించారు.ఈ సందర్భం ఆయన ఆయిల్ ఫాం సాగు దారులు ఎదుర్కొంటున్న సమస్యలు పై సమావెశంలో మాట్లాడారు. ఆయిల్ ఫాం సాగు లో పెరిగిన వ్యయం దృష్ట్యా టన్ను గెలలు కు రూ.20 వేలు ఇవ్వాలి అని,నాణ్యమైన మొక్కలు ఇవ్వాలని,ఏళ్ళ తరబడి బకాయి పడ్డ రాయితీలను వెంటనే చెల్లించాలని,పోడు, ఫారెస్ట్, ధరణి బాదితుల కు మొక్కలు,డ్రిప్ ,రాయితీలు ఇవ్వాలని సమావేశంలో తీర్మాణం చేసారు. ఈ సమావేశంలో రాష్ట్ర అద్యక్ష కార్యదర్శులు సుదర్శన్ రావు, సాగర్ లు పాల్గొన్నారు.