– ప్రతాపరుద్రుడి కోటపైన ట్రెక్కింగ్ నిర్వహించిన వాకర్స్
నవతెలంగాణ-అచ్చంపేట రూరల్
నయా పైసా ఖర్చు లేకుండా మన ఆరోగ్యాన్ని దివ్యంగా ఉంచే అద్భుతమైన ఔషధం వ్యాయాయమని అచ్చంపేట వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు చందునాయక్ అన్నారు. ఆదివారం మార్నింగ్ వాక్ లో భాగంగా అచ్చంపేట వాకర్స్ క్లబ్ ధ్వర్యంలో నల్లమల్లలోని చారిత్రాత్మక చరిత్ర కలిగిన ప్రతాపరుద్రుడి కోటపైకి ట్రెక్కింగ్ నిర్వహించారు. అచ్చంపేట నుండి అధికారులు, వ్యాపారస్తులు, ఉద్యోగులు, యువకులు 70 మంది వరకు వాకర్స్ ప్రతాపరుద్రుడి కోటపైకి మార్నింగ్ వాక్ చేశారు. దాదాపు రెండు గంటలపాటు ట్రెక్కింగ్ కొనసాగింది. కోటపైన కనిపించే ఆకట్టుకునే ప్రకతి అందాలను ఆస్వాదించారు. ప్రకతి ఒడిలో మార్నింగ్ వాక్ చేయడం జీవితంలో మరిచిపోలేని గొప్ప అనుభూతి కలిగిందని అన్నారు. ప్రతిరోజు వాకింగ్ చేయడం వల్ల దాదాపు 25 జబ్బుల నుంచి కాపాడుకోవచ్చని అన్నారు. బిపి, షుగర్, గుండె జబ్బులు, క్యాన్సర్లు, మోకాళ్ళ నొప్పులు, మానసిక ఒత్తిళ్లు, ఆందోళన, డిప్రెషన్, అధిక బరువు తగ్గుతుందని అన్నారు. ప్రతిరోజు వాకింగ్ చేయడం అలవాటుగా చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పిడి నగేష్. జిహెచ్‌ఎం శ్రీనివాస్ రెడ్డి, తాసిల్దార్ రమేష్, రామకృష్ణ, నరసింహ, భగీరనాథ్, రాములు, నిరంజన్, గ్రూప్ల నాయక్, బిచ్చ నాయక్, యాదగిరి, గణపతి, శ్రీనివాసులు, చందర్లాల్, ఝాన్సీరామ్, ఖదీర్, భాస్కర్, కిషన్, స్వామినాథం, అర్జున్ గౌడ్, శరన్ గౌడ్, శేఖర్, నిరంజన్, పుల్లయ్య, ఏఈ అంజనేయులు, డాక్టర్ లింగాచారి, బసవయ్య, సేవియా, వెంకటేష్, నారాయణ, లక్ష్మణ్, గోపాల్, శ్రీను, శ్రీకాంత్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.