పచ్చి రొట్ట.. భూసారం పెంచడంలో దిట్ట..

– సబ్సిడీపై అందుబాటులో 90 క్వింటాళ్ల జీలుగా విత్తనాలు 
– మండల వ్యవయాధికారి అత్తె సుధాకర్
నవతెలంగాణ – మల్హర్ రావు
పచ్చిరొట్టె భూసారం పెంచడంలో దిట్టని మండల వ్యవసాయ అధికారి అత్తే సుధాకర్ అన్నారు.మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఓ మాట్లాడారు రాబోవు వానాకాలం 2024 సీజన్ కు గాను రాయితీ పై జీలుగ విత్తనాలు 90 క్వింటాల్లు మండల కేంద్రమైన తాడిచెర్లలోని  ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం,కొయ్యుర్ అగ్రోస్ రైతు సేవ కేంద్రంలో విత్తనాలు పంపిణీకి సిద్దంగా ఉన్నాయన్నారు.ఇట్టి పచ్చి రొట్ట జీలుగా విత్తనాలు కిలోకు మొత్తం ధర రూ.93.00, ప్రభుత్వ రాయితీ 55.80, రైతు వాట రూ. 37.20 ఉంటుంది. ఎకరానికి 12 కిలోల చొప్పున రెండున్నర ఎకరాలకు సరిపోతుంది. వరి పంట మిరప పంట వేసే రైతులు తప్పనిసరిగా ఈ పచ్చి రోట్ట విత్తనాలు తోలకరిలో దుక్కి దున్ని చల్లుకొని 45 రోజుల తర్వాత పూత దశలో భూమిలో కలియదున్నుకొన్నచో భూమి సారవంతం కావడమే కాక పంట దిగుబడులు పెరుగుతాయని తెలిపారు. ఇట్టి జీలుగ విత్తనాలు కావలసిన రైతులు పట్టా పాస్ పుస్తకం, ఆధార్ కార్డ్ ప్రతితో మండల వ్యవసాయధికారి కార్యాలయం లో సంప్రదించాలని సూచించారు. ఒక బస్తా (30కిలోల) జీలుగ విత్తనాలు రూ. 1116 ఉంటుందన్నారు.