
– డీఆర్డిఓ,డిఅర్ డిఎ పిడి సాయగౌడ్..
జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం డిర్పల్లి టీటీడీసీలో ఎపియంలు, సీసీలు, సిబ్బందితో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిర్వహిస్తున్న వివిధ రకాల పథకాల కార్యక్రమాలపై డీఆర్డీఓ,డిఅర్ డిఎ పిడి సాయగౌడ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. బ్యాంకు లింకేజీలో భాగంగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను 100 శాతం లక్ష్యాన్ని పూర్తి చేసినందుకు గాను సిబ్బందిని అభినందనలు తెలిపారు. ఈ ఆర్ధిక సంవత్సరం 1032.74 కోట్ల లక్ష్యాన్ని పూర్తి చేయడానికి అందరూ కలిసి పని చేయాలని సూచించారు. స్త్రీ నిధి ద్వారా 2023-24 ఆర్థిక సంవత్సరంకు గాను లక్ష్యాన్ని పూర్తి చేసినందుకు అభినందనలు తెలుపుతూ ప్రస్తుత సంవత్సరం 2024-25 కు కేటాయించిన లక్ష్యాన్ని పూర్తి చేయడానికి సిబ్బంది అందరూ కలిసి పని చేయాలని సూచించారు. గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఆడిట్ ఈ నెల 23 నుండి 28 వరకు పూర్తి చేసి జూన్ 4 వరకు రిపోర్టు సబ్మిట్ చేయాలన్నారు. 1బి కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలు అన్నింటిలోనూ ముందంజలో ఉంటూ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉన్నందుకు సిబ్బంది అందరిని అభినందించారు. ఎస్ హెచ్ జి, విఓలు ఆర్థిక లావాదేవీలను ఆన్లైన్లో నిర్దిష్ట సమయంలో ఎంట్రీ చేసి అన్ని సంఘాలు ఎ గ్రేడ్లో ఉండేలా సిబ్బంది చూసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు యూనిఫామ్లను అందించేందుకు కీలక బాధ్యతలు మహిళా సంఘాలకు అప్పగించాలన్నారు. కుట్టుమిషన్లో అనుభవం గల మహిళలకు యూనిఫాం కుట్టడం, కటింగ్ పై శిక్షణనిచ్చి త్వరగా పూర్తి చేయాలన్నారు. వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ముగింపు దశలో ఉన్నందున రికన్సోలేషన్ త్వరగా పూర్తి చేయాలన్నారు. సమావేశంలో అడిషనల్ పిడి రవిందర్, డిపిఎంలు,ఎటిఎం లు అధికారులు తదితరులు పాల్గొన్నారు.