నవతెలంగాణ – గోవిందరావుపేట
మండలంలోని లక్నవరం చెరువు నీటిని తూముల మరమ్మత్తు కొరకై దెయ్యాలవాగులోకి వదలబోతున్నట్లు ఏ ఈ ఉపేందర్ రెడ్డి తెలిపారు. బుధవారం ఉపేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..ప్రస్తుతం లక్నవరం చెరువులో 18 అడుగుల పైబడి నరు నిలువ ఉందని 20 లక్షల పైచిలుకు రూపాయల వ్యయంతో తూముల మరమ్మతు పనులు చేపట్టవలసి ఉన్నందున నిధులు కూడా మంజూరి అయినందున నీరు అధికంగా ఉన్న పరిస్థితుల్లో సాధ్యం కాకపోవడం వల్ల సుమారు 10 అడుగుల పైబడి నీటిని దెయ్యాలవాగులోకి విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఏర్పాట్లు చేసుకోవాలని సూచించిన ఉన్నతాధికారుల ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఆదేశాలు అందితేనే నీటిని విడుదల చేయడం జరుగుతుందని అన్నారు. రైతులు అన్యద అర్థం చేసుకోవద్దని అభివృద్ధి కొరకే నీటి విడుదల చేయవలసిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. చెరువు అభివృద్ధిలో రైతుల సహకారం ఎంతైనా అవసరమని అన్నారు.