నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల మండలం రాయిచెడు గ్రామంలో కామ్రేడ్ నోముల జంగయ్య మూడవ వర్ధంతి కి ముఖ్య అతిథులుగా జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్ మల్లేష్ హాజరయ్యారు. జంగయ్య చిత్రపటానికి పూలమాలలు వేసిన నోముల లింగమయ్య, సీపీఐ(ఎం) పార్టీ గ్రామ సీనియర్ నాయకులు గొడుగు చంద్రయ్య, ఉప్పునుంతల మండల కార్యదర్శి చింతల నాగరాజు నోముల జంగయ్య వర్ధంతి వేడుకలకు హాజరై స్మారక స్తూపం దగ్గర ఘనంగా నిర్వహించి పూలమాలలు వేసి నోముల జంగయ్య సీపీఐ(ఎం) పార్టీకి గ్రామాల్లో కష్టపడీ పార్టీకి ఆకర్షితులై ఎల్లవేళలా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండి చనిపోయే నాటికి కూడా ఎర్రజెండా తన ఇంటిపై పెట్టుకుని అభిమానం చాటుకొని చివరి ప్రాణం ఉన్నంతవరకు ఎర్ర జెండాను పట్టు వదలలేదు అని జిల్లా కార్యదర్శి సభ్యులు ఎస్ మల్లేష్ అన్నారు. కేంద్రంలో బీజేపీ పాలనకు చర్మ గీతం పాడాలని యువతను కోరారు. దేశంలో రాష్ట్రంలో బీజేపీ విధానాలు వ్యతిరేకంగా ఎదుర్కొంటున్న ఏకైక పార్టీ సీపీఐ(ఎం) అన్నారు. గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని కోరారు. జంగయ్య స్మారక స్తూపం వద్ద పాటలతో నినాదాలతో జోహార్లు జంగయ్య అంటూ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పార్టీ గ్రామ సెక్రెటరీ గొడుగు వెంకటయ్య, సింగారం చంద్రయ్య, మల్లయ్య, సాయిలు, శ్రీను, సాయిబాబు, తదితరులు పాల్గొన్నారు.