
నవతెలంగాణ – ఉప్పునుంతల
విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యత కల్పించి అచ్చంపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు.ఉప్పునుంతల మండల కేంద్రంలోని రైతు వేదికలో ఎంపీపీ తిపర్తి అరుణ నర్సింహారెడ్డి అధ్యక్షతన బుధవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి నాగర్ కర్నూల్ ఎంపీ రాములు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామంలో ఉన్న సమస్యలను అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.గ్రామాల్లో సర్పంచ్లు లేకపోవడంతో బాధ్యత యుతంగా ఉండలని సూచించారు.కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్నప్పటికీ టిఆర్ఎస్ పార్టీ నాయకులు పూర్తిస్థాయిలో కరెంటు అందటం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అందుకుగాను అధికారులకు ఏదైనా సమస్యలున్నా తలెత్తినా సమస్యని పరిష్కరించి నిరంతరం కరెంటు అందించే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. వర్షాకాలం ఈదురుగాలులు సమయం కాబట్టి ఇలాంటి ప్రమాదాలు సంభవించకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు.ఎంపీ రాములు మాట్లాడుతూ సమిష్టి కృషితోనే గ్రామాల్లో అభివృద్ధి సాధ్యమైతుందని ఆ దిశగా అధికారులు ప్రజా ప్రతినిధులు కలిసి మెలిసి ఉండాలని ఆయన సూచించారు. పాఠశాలలు పున: ప్రారంభం అయ్యేసరికి మన ఊరు మనబడి, అమ్మ ఆదర్శ పాఠశాలల అభివృద్ధి పనులను పూర్తి చేయాలని సూచించారు. స్థానిక ఎమ్మెల్యే వైద్య వృత్తిలో ఉన్నందున వైద్య రంగానికి విద్యారంగానికి అధిక ప్రాధాన్యత కల్పించి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో నడిపించాలని ఆయన కోరారు. మూడు నెలలకు ఒకసారి జరిగే జనరల్ బాడీ సమావేశానికి నియోజకవర్గ స్థాయి సంబంధిత శాఖ అధికారులు కూడా హాజరవ్వాలని సూచించారు సమావేశానికి రాని అధికారులపై చర్యలు చేపట్టి మెమో జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జడ్పిటిసి అనంత ప్రతాపరెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ సత్తు భూపాల్ రావు,ఎంపీడీఓ లక్ష్మణరావు, తాహసిల్దార్ శ్రీకాంత్ ఆయా గ్రామాల ఎంపీటీసీలు,ఆయా శాఖల అధికారులు,స్థానిక నేతలు కట్ట అనంతరెడ్డి, తిప్పర్తి నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.