
జూన్ 4 వ తేదీన భువనగిరి పార్లమెంట్ కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పక్కాగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు హనుమంత్ కే.జెండగే అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లుకు సూచించారు. గురువారం నాడు కాన్ఫరెన్స్ హాలులో ఆయన భువనగిరి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు, నోడల్ అధికారులతో సమావేశమై పార్లమెంట్ కౌంటింగ్ కోసం చేపట్టే ఏర్పాట్లను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. కౌంటింగ్ ప్రక్రియలో ఓటు గోప్యత చాలా ముఖ్యమని, స్ట్రాంగ్ రూమ్ నుండి కౌంటింగ్ హాలుకు, కౌంటింగ్ అనంతరం తిరిగి స్ట్రాంగ్ రూముకు ఇవిఎం యంత్రాలను సీల్ వేసి భద్రపరచే ప్రక్రియలో ప్రతి దశలో కూడా ఎన్నికల నిబంధనలను పక్కాగా పాంటించాలని సూచించారు. కౌంటింగ్ కమ్యూనికేషన్ ప్లాన్, కౌంటింగ్ ఏజెంట్ల నియామకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కౌంటింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్, పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఏర్పాట్లు, సీల్ వేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కంప్యూటర్స్, స్కానర్స్, ప్రింటర్స్, స్టేషనరీ, కౌంటింగ్ సెంటర్లో కావలసిన వసతులు, ఫర్నీచర్, త్రాగునీరు, టిఫిన్, భోజన తదితర ఏర్పాట్లను అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు పక్కాగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉప ఎన్నికల అధికారి, జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టరు పి బెన్ షాలోమ్, భువనగిరి అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, ఆర్డిఓ అమరేందర్, ఆలేరు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు కె గంగాధర్, మునుగోడు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి డి సుబ్రహ్మణ్యం, నకిరేకల్ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి పూర్ణచందర్, తుంగతుర్తి అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి బిఎస్ లత, జనగాం అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి డి కొమరయ్య, ఇబ్రహింపట్నం అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి కె అనంతరెడ్డి, నోడల్ అధికారులు, ఎంకోర్ ఆపరేటర్స్, ఎన్నికల విభాగం సిబ్బంది పాల్గొన్నారు.