
తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు & సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కి తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి గురువారం హైదరాబాదులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శాలువా కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారితో మాట్లాడుతూ మార్కెట్ కమిటీ పరిధిలో ఉన్న ప్రాంతాల అభివృద్ధి కోసం సహాయం చేయాలని కోరారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పసుల అశోక్ యాదవ్, మండల కాంగ్రెస్ నాయకులు చిర్ర శ్రీనాథ్ గౌడ్, కొమ్ము శ్రీను, రవి, సురేందర్,విజయ్ తదితర నాయకులు పాల్గొన్నారు.