
నవతెలంగాణ – మల్హర్ రావు
అమ్మ ఆదర్శ పాఠశాలల్లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మరమ్మతుల పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించి బడులు పున ప్రారంభం నాటికి పూర్తియ్యేలా పనుల్లో వేగం పెంచాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేస్ మిశ్రా ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అంధించడానికి ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాటశాలలకు నిధులు మంజూరు చేసి పనులు ప్రారబించింది.ఈ పనులను గురువారం భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేస్ మిశ్రా మండలంలోని కొండంపేట, కొయ్యుర్ గ్రామ శివారు లోని పి వి నగర్ ,తాడిచెర్లలోని ఎస్సి కాలనిలో ప్రాథమిక పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించి, జరుగుతున్న అమ్మ ఆదర్శ పాఠశాలల మరమ్మత్తు పనులను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు ప్రాథమిక పాఠశాలల్లో మరుగుదొడ్లు, ఆవరణలో వివిధ రకాల పండ్ల మొక్కలను నాటాలని సూచించారు. ఎత్తు పల్లాలు లేకుండా పాఠశాల అవరణను ఉపాధి హామీ పధకం పనులు చేపట్టి మట్టితో నింపాలన్నారు.విద్యార్థులు చేతులు కడుక్కోవడానికి వీలుగా వాషింగ్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయాలని ఎంపీడీవోను ఆదేశించారు. పనులు వేగంగా జరగాలని పాఠశాల పునః ప్రారంభం నాటికి అన్ని పనులను పూర్తి చేసి పాఠశాలలను ఆహ్లాదకరంగా తయారు చేయాలని ఆయన పేర్కొన్నారు. అనంతరం కొండంపేట గ్రామంలో వరిదాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో ముఖాముఖి నిర్వహించారు. దాన్యం విక్రయాల్లో రైతులు నాణ్యత, తేమ శాతం పాటించాలని 17 శాతం కంటే తేమ తక్కువ ఉండేలా రైతులు వరిదాన్యం ఎండ బెట్టాలని రైతులకు సూచించారు అకాల వర్షాలతో సెంటర్లలో వరిదాన్యం తడిసి పోవడం జరిగింది కాబట్టి రైతులు ఎలాంటి అపోహలకు గురి కావద్దని ప్రతి చివరి గింజ వరకు వరిదాన్యం కొనుగోలు చేస్తామని కలెక్టర్ రైతులకు భరోసా ఇచ్చారు.పి వి నగర్ సమీపంలోని బొగ్గులవాగు స్ట్రీమ్ 3 క్రింద గుర్తించిన ఇసుక రీచ్ ను సందర్శించి పేదల ఇండ్ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని స్థానిల తాశిల్దార్ ను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి అవినాష్, తాశిల్దార్ రవికుమార్ ఎంపీడీవో శ్యామ్ సుందర్, పిఆర్ ఏ ఈ లు ,వివో ఏలు,పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.