నవతెలంగాణ – ఆర్మూర్
కాలుష్య నియంత్రణ మండలి సూచనలను మేరకు మున్సిపల్ చైర్పర్సన్ వన్నెల్ దేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ మున్సిపల్ కమిషనర్ రాజు ఆదేశానుసారం గురువారం పట్టణంలోని పలు హోటల్స్ లలో ,బేకరీలలో ప్లాస్టిక్ పరిశుభ్రతపై తనిఖీలు నిర్వహించినారు..తనిఖీల్లో పట్టుబడిన ప్లాస్టిక్ ను సీజ్ చేసి 10,500 రూపాయల జరిమానా విధించడం జరిగింది ఈ తనిఖీలలో సానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్ కుమార్, పర్యావరణ ఇంజనీర్ పూర్ణ మౌళి, మున్సిపల్ సిబ్బంది వెంకటేష్ అక్షయ్, రవి, ప్రశాంత్, నరేష్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.