ఉపాధి హామీ కూలీల సమస్యలు పరిష్కరించాలి

– ఉపాధి హామీ కూలీలకు కనీససౌకర్యలుకలిపించడంలో   ప్రభుత్వం విఫలం
– ఊరిలకు ఫోటో అప్లోడ్ నిబంధన ను తొలగించాలి

– తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రాళ్లబండి శశిధర్.                
నవతెలంగాణ – మిరుదొడ్డి 
ఉపాధి హామీ కూలీల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలినీ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సిద్దిపేట జిల్లా కార్యదర్శి రాళ్ళబండి శశిధర్ అన్నారు.శుక్ర వారం  అక్బర్ పేట – భూం పల్లి మండలం రుద్రారం లో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఉపాధి హామీ పని ప్రదేశాలను సందర్శించారు.ఈ సందర్భంగా కూలీలను వారి సమస్యలను అడిగి  తెలుసుకున్నారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీని రోజు రోజుకు నిర్వీర్యం చేసే విధానాలను చేపడుతుందని ఈ విధానాల వల్ల కూలీలకు అనేక సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. 2005లో ఉపాధి హామీ చట్టాన్ని వామపక్షాల పోరాటంతో చేసిందన్నారు. చట్టంలో రూపొందించిన నిబంధనలను ఏ మాత్రం పాటించడం లేదని అన్నారు. 2005 లో కేంద్ర బడ్జెట్లో 98 వేల కోట్లు రూపాయలతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి నిధులు కేటాయిస్తే 2024-25 సంవత్సరానికి కేవలం 56 వేల కోట్లు మాత్రమే  ఉపాధి ఆమెకి కేటాయించారని దీనివల్ల కూలీలకు పెండింగ్ బిల్లులతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. కొత్త గా జాబు కార్డులు ఇవ్వడం లేదని పని ప్రదేశాల్లో చిన్న పిల్లల్ని ఆడించడానికి నీడ కల్పించేందుకు టెంట్లు వేయాలని, మంచినీరు, రవాణా సౌకర్యం కల్పించడం లేదని అన్నారు.
కూలీలకు గడ్డపార తట్ట పారా కొడవళ్ళు గొడ్డలి లాంటి పనిముట్లు కూడా ఇవ్వడం లేదన్నారు. కొలతల పేరుతో గట్టి ప్రదేశాలలో కనీస కూలి కూడా గిట్టుబాటు కావడం లేదని ప్రభుత్వం పేరుకే రూ.300 రూపాయలు కూలి అని చెప్పిన ఎక్కడ అమలు కావడం లేదని విమర్శించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రోజురోజుకు నిర్వీర్యం చేసే విధంగా అనేక  ఆకాంక్షలు విధిస్తూ ఉదయం సాయంత్రం ఫోటోలు అప్లోడ్ చేయాలని, డ్రోన్ కెమెరాలతో పనులను పర్యవేక్షించాలని రకరకాల నిబంధనలు పెట్టి ఉపాధికి కూలీల దూరం చేసే విధానం తీసుకొస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కొత్త జాబ్ కార్డులు ఇవ్వాలని ఉపాధి పని 200 రోజులకు పెంచాలని రోజు కూలి రూ.600 రూపాయలు ఇవ్వాలని పని ప్రదేశాలలో సౌకర్యాలు కల్పించాలని పనిముట్లు ఇవ్వాలని ఏదైనా ప్రమాదం సంభవిస్తే చట్టప్రకారం వారికి సహయం అందించాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్న పథకాలలో ఉపాధి కూలీలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ కార్మికులకు రూ.12 వేల రూపాయల కూలి బందు ఇస్తానని ప్రకటించిందని దానిని కూడా వెంటనే అమలు చేయాలని ఇండ్లు లేని నిరుపేద వ్యవసాయ కూలీలకు ఇంటి జాగాతో పాటు ఇంటి నిర్మాణం చేసి ఇవ్వాలని, అర్హులైన  వారందరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కాముని గోపాలస్వామి,బోయిని వెంకటి,ఈదరి కనకవ్వ, ఈదరి కొండవ్వా,నాగరాజు,మైపాల్రెడ్డి,బిట్ల రేన,నర్సింలు,కిష్టయ్య, తదితరులు పాల్గొన్నారు.