బొడ్రాయి వేడుకల్లో ఎమ్మెల్యే..

నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల మండలం పెనిమిళ్ళ గ్రామంలోని శుక్రవారం బొడ్రాయి దేవుడి మొదటి వార్షికోత్సవ సందర్భంగా వేడుకలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, తిప్పర్తి నరసింహారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని బొడ్రాయికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ గ్రామంలోని గ్రామ దేవతల పండగలు నిర్వహించడం ఆనందంగా ఉందని గ్రామ ప్రజలతో ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, రైతులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.