– పురుషులు 908, మహిళలు 444: మొత్తం 1352
నవతెలంగాణ – దంతాలపల్లి
ఈనెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలను పట్టభద్రులు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని స్థానిక తహసిల్దార్ శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం ఆయన నవతెలంగాణతో మాట్లాడుతూ మండల వ్యాప్తంగా 908 పురుషులు, 444 మహిళలు మొత్తం 1352 పట్టబద్రుల ఓట్లు ఉన్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీ పోలింగ్ కు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. పోలింగ్ కేంద్రం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో ఉదయం 8 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ ఉంటుందని తెలిపారు. ఇప్పటికే మండలంలోని ఆయా ప్రాంతాల్లో ఉన్న అంగన్వాడీ టీచర్లు (బి ఎల్ వో లు) ఓటర్ స్లిప్పులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. సమస్యత్మక ప్రాంతాల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు నియమించినట్లు తెలిపారు.