నవతెలంగాణ – రెంజల్
గత వారం రెంజల్ మండలం నీలా గ్రామంలోని చెరువులో ఉపాధి హామీ పథకం కింద ఏర్పాటు చేసిన పనుల లో కూలీలు అధిక సంఖ్యలో పాల్గొని పనులను కొనసాగిస్తున్నారు. చెరువులు కూడికతీత తో పాటు సారవంతమైన మట్టిని తమ పంట పొలాలకు తరలించడానికి రైతులు ముందుకు రావడంతో పనులు చకచకా కొనసాగుతున్నాయని క్షేత్ర సహాయకుడు నారాయణ పేర్కొన్నారు. శుక్రవారం సుమారు 400 పై కూలీలు పనులను చేపట్టగా సుమారు నాలుగు నుంచి ఐదు డాక్టర్లు అట్టి మట్టిని తమ పంట పొలాల్లో తరలించడం విశేషం. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు కూలీలకు తగిన వేతనాన్ని చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఉపాధి కూలీలు కోరుతున్నాను.