ధాన్యాన్ని అమ్ముకోవడానికి అరిగోస పడుతున్న అన్నదాతలు: దిడ్డి మోహన్ రావు

– ధాన్యం కొనుగోళ్లపై నిర్లక్ష్యం చేస్తున్న అధికారులు
నవతెలంగాణ – తాడ్వాయి
ఆరుగాలం కష్టపడి యాసంగి చేసి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి అమ్ముకోవడానికి వస్తే ధాన్యం కొనకుండా నిర్లక్ష్యంగా అధికారులు వివరిస్తున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారని రైతు సమన్వయ కమిటీ మాజీ అధ్యక్షులు, బిఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు దిడ్డి మోహన్ రావు అన్నారు. ప్రభుత్వం, కలెక్టర్ లు తడిసిన ధాన్యాలైన సైతం కొనుగోలు చేస్తామని, చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని చెప్పుతున్నప్పటికీ, మండలంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల లో ధాన్యానికి తేమ శాతం అధికంగా ఉందని (మాక్చుర్లేదు) ధాన్యాన్ని కొనకుండా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. ఓ వైపు అకాల వానలు భయపెడుతుండగా ధాన్యం రైతు  దైన్యస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. తేమ శాతం పేరుతో నాన్న ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన ఆవేదన చెందారు. అధికారులు స్పందించి అకాల వర్షాలు ధాన్యాం పూర్తిగా నష్టపోకుండా తొందర తొందరగా ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు మేలు చేయాలని డిమాండ్ చేశారు.