కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం: యశస్విని రెడ్డి 

నవతెలంగాణ – పెద్దవంగర
అనతి కాలంలోనే తనను ఆదరించి, భారీ మెజార్టీతో గెలిపించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలను ఎల్లప్పుడూ కంటికి రెప్పల కాపాడుకుంటానని పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. ఉప్పెరగూడెం గ్రామానికి చెందిన నీలం బుచ్చమ్మ (58) అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శుక్రవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ఓదార్చారు. మృతిరాలి కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఆమె వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్, సీనియర్ నాయకులు కేతిరెడ్డి నిరంజన్ రెడ్డి, దుంపల కుమారస్వామి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బీసు హరికృష్ణ గౌడ్, వేముల వెంకన్న, లక్ష్మయ్య తదితరులు ఉన్నారు.