
డిచ్ పల్లి ఎంపీపీ, వైఎస్ ఎంపీపీ పదవులను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నది. శుక్రవారం డిచ్ పల్లి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం ఎంపీపీ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల పదవులకు ఎన్నిక ను నిర్వహించారు. ఈ ఎన్నికల్లో డిచ్ పల్లి ఎంపీపీ చిన్నోళ్ల నర్సయ్య (నడిపల్లి ఎంపీటీసీ-2, వైస్ ఎంపీపీ గా దండుగుల సాయిలు (అమృతాపూర్- ఎంపీటీసీ) ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు ప్రెసిడింగ్ అధికారి, జడ్పీ డీప్యూటీ సీఈవో సుందర వర్దరాజన్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 17 మంది ఎంపీటీసీ సభ్యులకుగాను 13 మంది ఎంపీటీసీ సభ్యులు హజరయ్యారని, కోరం ఉన్నందున, ఎన్నిక నిర్వహించినట్లు పేర్కొన్నారు. రెండు పదవులకు ఒక్కొక్క నామినేషన్ రావడంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. అనంతరం ఎన్నికయిన ఎంపీపీ, వైఎస్
ఎంపీపీలకు ఎన్నిక పత్రాలను అందించారు. కార్యక్రమంలో ఎంపీడీవో రవీందర్, ఎంపీవో శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. గతంలో ఎంపీపీ, వైఎస్ ఎంపీపీ రెండు
పదవులు భాజపా పార్టీకి చెందిన వారు చెపట్టారు. ఆవిశ్వాస తీర్మాణంతో పదవులు ఖాళీలు ఎర్పడటంతో ఈ రోజు ఎన్నిక నిర్వహించారు.