ముస్లింలకు ఓబిసి సర్టిఫికెట్ల రద్దు పట్ల హర్షం వ్యక్తం చేసిన ఆకుల రాజేందర్

నవతెలంగాణ – జమ్మికుంట
దేశంలో ఎక్కడ లేని విధంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం కులాలకు జారీచేసిన ఓబీసీల ధ్రువీకరణ పత్రాలను కోర్టు రద్దు చేయడం పట్ల ఓబిసి మోర్చా కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్ హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం జమ్మికుంటలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.  2010 సంవత్సరం లో పశ్చిమ బెంగాల్ లోని మమతా బెనర్జీ ప్రభుత్వం ముస్లింలకు ఓబీసీ సర్టిఫికెట్లు జారీ చేసిందని, దీంతో లక్షలాదిమంది ఓబీసీలకు తమకు అందాల్సిన ప్రయోజనాలు కోల్పోవాల్సి వస్తుందని, నిజమైన ఓబీసీలు కలకత్తా హైకోర్టును ఆశ్రయించారని తెలిపారు. ఈ విషయంపై అనేక రోజులపాటు ప్రత్యేకంగా విచారణ చేపట్టిన కలకత్తా హైకోర్టు 2010 నుండి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం జారీ చేసిన ఓబిసి సర్టిఫికెట్లన్నీ క్యాన్సల్ చేసిందన్నారు. 2010 నుండి ముస్లింలకు జారీ చేసిన ఓబీసీ సర్టిఫికెట్లను మొత్తాన్ని రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు సంచల తీర్పు ఇచ్చిందని, ఇది మమతా బెనర్జీ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదన్నారు.  ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం ఓబీసీలపై   ఉక్కు పాదం మోపుతూ, అనేక రకాల ఇబ్బందులకు గురిచేసిందని , పైగా ముస్లింలకు ఓబిసి ధ్రువపత్రాలు అందించి  అసలైన ఓబీసీలకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. నేడు కోల్ కత్తా హైకోర్టు తీర్పుతో ఓబీసీలకు సరైన న్యాయం జరిగిందని, దేశంలో మమతా బెనర్జీల వ్యవహరించే ప్రభుత్వాలకు ఇది గుణపాఠం లాంటిదన్నారు. ఈ కార్యక్రమంలో ఓబిసి మోర్చా  నాయకులు రావుల వేణు,  ప్రభాకర్,  గంట సంపత్ కుమార్, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.