నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండలంలోని నీల గ్రామ సమీపంలో ఉన్న సైలని బాబా దర్గాను పాతబస్తీ చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫికర్ అలీ శనివారం రాత్రి సందర్శించి ప్రత్యేక ప్రార్థనలను చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో తాను గెలుపొందినట్లయితే తిరిగి దర్గాను సందర్శించుకుంటానని ఆయన మొక్కుకొని గెలుపొందిన అనంతరం ఈరోజు ఆయన దర్గాను సందర్శించి శైలాని బాబా కు చాదర్ కప్పి పూలమాలలతో సత్కరించి ప్రత్యేక ప్రార్థనలను చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఆయన వెంట దర్గా నిర్వాహకులు వహీద్ బాబా, కొప్పర్ గా మాజీ సర్పంచ్ ఖలీల్ పటేల్, ఎన్ఎస్ యుఐ మాజీ మండల అధ్యక్షులు హాజీ ఖాన్, మూస, దర్గా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.