నవతెలంగాణ – జక్రాన్ పల్లి
మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏకారుపా దుస్తులను కుట్టించి ఇవ్వడం జరుగుతుందని, కుట్టి ఇవ్వడం జరుగుతుందని ఏపిఎం రవీందర్ రెడ్డి తెలిపారు. ఈ సంవత్సరం ప్రభుత్వము ఏకరూప దుస్తులను మహిళా సంఘాల ద్వారా కుట్టించి మహిళా సంఘ సభ్యులకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో ప్రతి మండలానికి ప్రభుత్వం ద్వారా ఏకరూప దుస్తులు కుట్టడానికి పట్టాను పంపించడం జరిగిందని తెలిపారు. ఆదివారం మండల సమైక్య కార్యాలయంలో ప్రభుత్వం ద్వారా వచ్చిన బట్టలు కొలతల ప్రకారం మహిళా సంఘాల సభ్యులు కటింగ్ చేసి బట్టలు కుట్టే విధంగా ప్రయత్నాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.