మృతుని కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల పరామర్శ

నవతెలంగాణ – పెద్దవంగర
మండలంలోని కొరిపల్లి గ్రామానికి చెందిన ఎర్ర నీరజ (35) అనారోగ్యంతో బాధపడుతు ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్ పార్టీ నాయకులతో కలిసి ఆదివారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సహాయం అందించారు. మృతిరాలి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి, ధైర్యం చెప్పారు. కార్యకర్తలే పట్టుకొమ్మలని, ఆపదలో ఉన్న కార్యకర్తలకు అన్ని విధాల అండగా ఉంటామని పేర్కొన్నారు. ఆయన వెంట మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రంగు మురళి గౌడ్, గ్రామ పార్టీ అధ్యక్షుడు దుర్సోజు సతీష్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎర్ర ఉపేందర్, మాజీ ఉపసర్పంచ్ వీరారెడ్డి, బూత్ కన్వీనర్ ఎర్ర యాదగిరి, ఎర్ర వెంకన్న, చిలుక ఉప్పలయ్య, ఎర్ర నర్సయ్య, ఎండీ జలాలుద్దీన్, నరేష్, రవి, అనిల్, మహేష్, తదితరులు ఉన్నారు.