
మండలంలోని ఎండపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ 2006-07-10వ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులంతా కలుసుకుని తమ అనుభవాలను పంచుకున్నారు. చిన్ననాటి అనుభవాలను గుర్తు చేసుకున్నారు ఈ సందర్భంగా అప్పుడు బోధించిన ఉపధ్యాయులు వసంత ,రామస్వామి, వరలక్ష్మి ,బంగారయ్య ,శ్రీనివాస్, జయ, మల్లేశం, రామకృష్ణయ్య, హాస్టల్ వార్డెన్ భీమ్ రెడ్డి లను శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం గెట్ టుగెదర్ ప్రోగ్రాంలో ఉత్సాహంగా పూర్వ విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి పాల్గొన్నారు.