– కంచుకోటలో తొలి రౌండ్లోనే ఓటమి
పారిస్ (ఫ్రాన్స్) : ఫ్రెంచ్ ఓపెన్‌లో 14 సార్లు చాంపియన్, దిగ్గజం స్పెయిన్ బుల్‌కు దిమ్మతిరిగే షాక్ తగిలింది. కంచుకోట రొలాండ్ గారోస్‌లో మెన్స్ సింగిల్స్ తొలి రౌండ్లోనే నాదల్ ఓటమి పాలయ్యాడు. నాల్గో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 6-3, 7-6(7-5), 6-3తో వరుస సెట్లలో నాదల్‌పై మెరుపు విజయం సాధించాడు. ఫిట్‌నెస్ కోల్పోయిన నాదల్ ఫ్రెంచ్ ఓపెన్‌లో రీ ఎంట్రీ ఇచ్చాడు. జ్వెరెవ్ ఆరు బ్రేక్ పాయింట్లతో మెరువగా.. నాదల్ రెండు బ్రేక్ పాయింట్లే సాధించాడు. మహిళల సింగిల్స్‌లో ఇగా స్వైటెక్ 6-1, 6-2తో లియోలియను చిత్తు చేసింది.కొకొ గాఫ్ సైతం జులియపై 6-1,6-1తో వరుస సెట్లలో అలవోక విజయం సాధించింది.