హైదరాబాద్ : సంస్కృతి సాంప్రదాయాలు, ఆధునిక ఫ్యాషన్లు ప్రతిబింబించు వస్త్ర ప్రపంచం ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు సూత్రా సంస్థ పేర్కొంది. మే 28 నుంచి 30 వరకు నోవాటెల్ హెచ్‌ఐసిసి నందు తమ సూత్రా ఎగ్జిబిషన్ జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు సందర్శకుల అభిరుచుల ననుసరించి దేశం నలుమూలల నుండి తెచ్చిన విభిన్న వస్త్ర సంపదను ఒకే వేదిక పైన ప్రదర్శన, విక్రయాలకు ఉంచుతున్నా మన్నారు. ఈ ప్రదర్శనలో ఎందరో కళాకారులు, చేనేత పనివారు డిజైనర్స్ అద్భుతంగా రూపొందించిన విస్తృత శ్రేణీ దుస్తులు, గృహాలంకరణ ఉత్పత్తులు, పాదరక్షలు సందర్శకులకు అందుబాటులో ఉంటాయన్నారు. అదే విధంగా ప్రముఖ జ్యుయలర్స్, ఫ్యాషన్ డిజైనర్లు, కళాకారులను, వారు కళాత్మకంగా సృష్టించిన ఉత్పత్తులను తీసుకు రావాలేది సూత్రా లక్ష్యం అన్నారు.