– తెలంగాణపై అసూయ పడుతున్న ఇతర రాష్ట్రాలు
– విద్యుత్ విజయోత్సవ ప్రగతిలో గుత్తా, భాస్కర్‌రావు
నవతెలంగాణ-మిర్యాలగూడ
ఉమ్మడి రాష్ట్రంలో చీకటి తెలంగాణగా ఉండగా నేడు వెలుగుల తెలంగాణగా మారిందని శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు అన్నారు. రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా దశాబ్ది ఉత్సవాల సందర్భంగా సోమవారం శ్రీమన్నారాయణ ఫంక్షన్ హాల్‌లో విద్యుత్ విజయోత్సవ ప్రగతి నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు కోతలు, పేలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్లు, వేలాడుతున్న తీగలు ఉండేవని, కరెంటు కోసం నిద్రాహారాలు మాని మేలుకొని ఉండే వారిని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సిద్ధిస్తే విద్యుత్ సౌకర్యం లేక అంధకారంగా మారుతుందని ఆనాటి ప్రభుత్వాలు చెప్పాయని గుర్తు చేశారు. ఆనాడు రాష్ట్రంలో 7 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన జరిగితే నేడు కేసీఆర్ నాయకత్వంలో 13 వేల మెగా ఓట్ల విద్యుత్ ఉత్పాదన జరుగుతుందన్నారు. నిరంతరం విద్యుత్‌తో పాటు వ్యవసాయానికి 24 గంటలు విద్యుత్ అందించిన ఘనత కేసిఆర్కే దక్కుతుందన్నారు. రెప్పపాటున కూడా కరెంటు పోయిన దాఖలాలు లేవని రాష్ట్రమంతా వెలుగులు జిమ్ముతున్నాయని చెప్పారు. రాష్ట్రానికి అవసరమైన విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడమే కాకుండా ఇతర రాష్ట్రాలకు విద్యుత్ సరఫరా చేసే స్థాయికి చేరుకున్నామని తెలిపారు. విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణను చూసి ఇతర రాష్ట్రాలు అసూయ పడుతున్నాయన్నారు. పరిశ్రమలు కూడా నిరంతర విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదరపు కలెక్టర్ ఖుష్భుగుప్తా, అగ్రోస్ కార్పొరేషన్ చైర్మెన్ తిప్పన విజయసింహారెడ్డి, మున్సిపల్ చైర్మెన్ తిరు నగర్ భార్గవ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీపీలు నూకల సరళ హనుమంతరెడ్డి, నందిని రవితేజ, బాలాజీ నాయక్, జెడ్పిటిసి పద్మా వెంకటేశ్వర్లు, జెడ్పి కోఆప్షన్ మోసిన్ అలీ, మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, ట్రాన్స్కో ఎస్ ఈ చంద్రశేఖర్, డీిఈ వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు సర్పంచులు ఎంపీటీసీలు, విద్యుత్ అధికారులు పాల్గొన్నారు.