మిత్రుని కుటుంబానికి తోటి మిత్రులు ఆర్థిక సహాయం

నవతెలంగాణ – గోవిందరావుపేట
రహదారి ప్రమాదంలో చనిపోయిన తన చిన్ననాటి స్నేహితుడు కుటుంబానికి తోటి స్నేహితులు మంగళవారం 25వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. 2002 -2003 పదవ తరగతి బ్యాచ్ అయిన విజయ్ యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది. వారి కుటుంబానికి ప్రతి బ్యాచ్ తరఫున  ఈరోజు 25 వేల రూపాయల ఆర్థిక సాయం చేయడం జరిగింది. కార్యక్రమంలో బిరెడ్డి సాంబశివ, గొంది రాజేష్, కందికట్ల దిలీప్, N సతీష్ కుమార్, జిట్ట బోయిన రమేష్   మశిఖ రమేష్ , యానాల సీతారాం రెడ్డి  తదితరులు పాల్గొన్నారు. మిత్రులు చేసిన ఈ సహాయాన్ని గ్రామస్తులు అభినందించారు.