ఫీజు నియంత్రణ చట్టం తేవాలి….

– ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చింతల శివ, లావుడియ రాజు…
నవతెలంగాణ భువనగిరి కలెక్టరేట్ 
తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు, కార్పోరేట్ విద్యాసంస్థలో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలి,విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలి,పర్మిషన్ లేని విద్యాసంస్థలను మూసివేయాలనీ యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్ఎఫ్ఐ  జిల్లా అధ్యక్ష , కార్యదర్శులు చింతల శివ, లావుడియ రాజులు కోరారు. మంగళవారం వారు ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రైవేట్ కళాశాలలో ఫీజులను నియంత్రించాలని  కోరుతూ  యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేసిన అనంతరం మాట్లాడారు.   ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థలు ఫీజులో నియంత్రణ చేయాలని విద్యా హక్కు చట్టాన్ని ప్రకటబందీగా అమలు చేయాలి పర్మిషన్ లేని శ్రీ చైతన్య విద్యా సంస్థలను మూసివేయాలని,ఫీజుల నియంత్రణ కోసం చట్టం తీసుకువచ్చామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన ఇప్పటివరకు ఎలాంటి చొరవ తీసుకోలేదనీ, ప్రజలు విద్యార్థుల చదువుల కోసం లక్షల ఫీజు కడుతున్నారనీ, ప్రభుత్వ విద్యారంగంపై తల్లిదండ్రులకు నమ్మకం లేకుండా పోతుందనారు. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వమే, ప్రభుత్వ స్కూల్లో సరిపడా మౌలిక సౌకర్యాలు లేవు టీచర్లు లేవని, ఇతర  రాష్ట్రాల్లో  నియంత్రణ చట్టం అమల్లో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఫీజు నియంత్రణ చట్టం అనేది లేదనీ. దేశంలోనే బెస్ట్ ఫీజు నియంత్రణ చట్టం తమిళనాడు కేరళ రాజస్థాన్ అమలోఉన్నాయి, విద్యాహక్కు చట్టం ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు ప్రవేట్ విద్యాసంస్థల్లో 25 శాతం  సీట్లను ఇవ్వాలి, విద్యాహక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి పర్మిషన్ లేని విద్యాసంస్థలపై చర్యలు తీసుకొని వాటిని మూసివేయాలని, జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రవేటు విద్యాసంస్థల అధికారులను వత్తాసు పలకకుండా విద్య హక్కు చట్టాన్ని ప్రైవేటు విద్యాసంస్థలో ప్రకటబందీగా అమలు చేయాలని ఎస్ఎఫ్ఐ గా డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శిలు పల్లె శివ వేముల నాగరాజు జిల్లా కమిటీ సభ్యులు బర్రె రాజు లు  పాల్గొన్నారు.