ఎమ్మార్పీ ధరలకే ఎరువులు విత్తనాలు

నవతెలంగాణ – మద్నూర్ 
 మద్నూర్ మండలంలో  మద్నూర్ రైతు వేదిక యందు మద్నూర్ మరియు డోన్గ్లి మండల విత్తన, ఎరువు డీలర్లతో సమావేశం ఏర్పాటు చేసి  రైతులకు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని సూచించడం జరిగింది. విత్తన బిల్ బుక్, స్టాక్ రిజిస్టర్, విత్తనాలు, ఎరువులు ఎక్కడ నుంచి తెచ్చారో వాటి వివరాలు అందుబాటులో ఉంచాలని , తెలపడం జరిగింది,అలాగే మద్నూర్ , మెనూర్ గ్రామాల్లో పలు దుకాణాలను పరిశీలించి రైతులకు ఎం ఆర్ పి ధరలకే అమ్మాలని , అమ్మిన వాటికి రసీదు తప్పకుండా ఇవ్వాలని మండల వ్యవసాయ అధికారి రాజు డీలర్లకు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో మద్నూర్ డోంగ్లి మండల డీలర్లు, ఏ ఈ ఓ లు పాల్గొన్నారు.