
– పోలీస్ లు, సిఆర్పిఎఫ్ భద్రతలో స్ట్రాంగ్ రూంలు
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
ఈ నెల 27 ( సోమవారం) జరిగిన వరంగల్ఖ,ఖమ్మం,నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికల పోలింగ్ అనంతరం ఫోలైన బ్యాలెట్ బాక్సులను నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని అనిశెట్టి దుప్పలపల్లి గోదాంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ ల లో భద్రపరచడం జరిగింది.వరంగల్,ఖమ్మం, నల్గొండ శాసన మండలి పట్ట భద్రుల నియోజకవర్గం పరిధిలోకి వచ్చే 12 జిల్లాల నుండి వచ్చిన బ్యాలెట్ బాక్సులన్నింటిని అనిశెట్టి దుప్పలపల్లి గోదాంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములలో ఎన్నికల సంఘం పరిశీలకులు రాహుల్ బొజ్జ సమక్షంలో, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, వారి ఏజెంట్లు హాజరుకాగా, జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి చందన, జిల్లా ఎస్పీ చందనా దీప్తి ఆధ్వర్యంలో బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూములలో భద్రపరిచారు.బ్యాలెట్ బాక్సులు భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దుప్పలపల్లి గోదాం మొత్తం పూర్తిగా స్థానిక పోలీస్ తో పాటు, సిఆర్పిఎఫ్ భద్రతలో ఉంది. సోమవారం ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఆయా జిల్లాల నుండి బ్యాలెట్ బాక్సులు దుప్పలపల్లి గోదాం కు చేరుకోగా వాటన్నిటినీ స్ట్రాంగ్ రూములలో ఉంచి ఎన్నికల పరిశీలకుల సమక్షంలో వాటికి సీల్ చేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, డి ఎఫ్ ఓ రాజా శేఖర్, డిఆర్డిఓ నాగిరెడ్డి, డిపివో మురళి, పిఆర్ ఈఈ భూమన్న, ఎస్బి డిఎస్పి రమేష్, బిజెపి నుండి ఎలక్షన్ ఏజెంట్ నాగం వర్షిత్ రెడ్డి, తీన్మార్ మల్లన్న ఏజెంట్ కాళీ,అభ్యర్థి రవి, బిఆర్ఎస్ నుండి అధికారిక ఏజెంట్ తదితరులు పాల్గొన్నారు.