అపరిశుభ్రతకు ఆనవాళ్లు హోటళ్లు..!

– పర్యవేక్షించని ఫుడ్ సేఫ్టీ అధికారులు..
– వేములవాడలో పుట్టగొడుగుల్లా పుట్టుకస్తున్న బిర్యాని పాయింట్లు, టిఫిన్ సెంటర్లు, మండి బిర్యాని,కర్రీ పాయింట్లు, హోటల్..
– ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియని అయోమయం..
– ఆహార భద్రత నియమాలు పాటించకపోతే చర్యలు..
– అనూష ఆహార భద్రత  అధికారి..
– సూచి శుభ్రత లేని ఆహారం వ్యాధులకు మూలం..
– ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ మహేష్ రావు..
నవతెలంగాణ – వేములవాడ
“రోడ్ సైడ్ ఫుడ్ వద్దు.. మంచి రెస్టారెంట్, హోటల్ కి వెళ్లి మంచి రుచికరమైన ఫ్రెష్ ఫుడ్ ఉంటుంది అని, పిల్లలకు చెప్పి తల్లితండ్రులకు రెస్టారెంట్ కి తీసుకువెళ్లి వాళ్లకు ఒక బిగ్ అలెర్ట్”..! హైదరాబాద్, కరీంనగర్ లాంటి మహా నగరాలలో పెద్దపెద్ద హోటల్లలో రెస్టారెంట్లలో ఆహారం అపరిశుభ్రత ఆనవాళ్లు హోటళ్లు అన్న రీతిలో ప్రజల ఆరోగ్యంతో చీలగాటమాడుతున్నారు.. నాసిరకం మసాలా దినుసులు.. అపరిశుభ్రమైన వంట గదులు.. వాడిన నూనెని తిరిగి మళ్ళీ మళ్ళీ కాగిన నూనెలోనే ఫ్రైలు.. రెస్టారెంట్లో, టిఫిన్ సెంటర్లలో, హోటల్, స్వీట్ షాప్, బిర్యానీ పాయింట్లు ,మండి బిర్యాని సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు,బేకరీలలో నాసిరకం సరుకులు ఎక్స్పైరీ అయినటువంటి పదార్థాలు ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలలో వెలుగులోకి వస్తున్నాయి..”అపరి శుభ్రతకు ఆనవాళ్లు హోటళ్లు”..! పై నవతెలంగాణ ప్రత్యేక కథనం..
పర్యవేక్షించని ఫుడ్ సేఫ్టీ అధికారులు..
దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన రాజన్న క్షేత్రం వేములవాడ..  అభివృద్ధి చెందుతున్న పట్టణం.. రాజన్న దర్శనానికి దేశ నలుమూలల నుండి వేలాదిమంది భక్తులు వస్తుంటారు. వేములవాడ పట్టణంలో హోటల్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, బిర్యాని పాయింట్లు, మండి బిర్యానీ సెంటర్లు, కర్రీ పాయింట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, స్వీట్ షాప్ ,బేకరీలు పుట్టగొడుగుల మునిసిపల్, ఫుడ్ సేఫ్టీ అధికారుల అనుమతులు లేకుండానే వీటిని స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రారంభోత్సవాలు జరపడం, అధికార, ధన బలం, నాయకుల ప్రోత్సాహంతో వెలుస్తున్నాయి. కుళ్ళిపోయిన వాసన, సూచి శుభ్రత నాణ్యతలేని రుచి లేని ఆహారం  పై రెస్టారెంట్ నిర్వాహకులకు కస్టమర్లు నిలదీస్తే తింటే తిను లేకుంటే పో.. కస్టమర్లపై చేతులు చేసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి.. వేములవాడలోని కొన్ని టిఫిన్స్ సెంటర్లలో తెల్ల పురుగులు, సాంబార్ లో బొద్దింకలు వచ్చాయని మునిసిపల్ అధికారులకు ఫిర్యాదు చేస్తే అ తనిఖీ లో కుళ్ళిపోయిన ఆహార పదార్థాలు, మిగిలిపోయిన ఆహారాన్ని ఫ్రిడ్జ్లలో నిల్వచేసిన సంఘటనలు పురపాలక సంఘం పారిశుద్ధ్య అధికారు తనిఖీల్లో వెలుగులోకి వచ్చాయి, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఫిర్యాదు చేద్దాం అంటే ఎవరికి చెప్పాలో హోటల్, రెస్టారెంట్స్, టిఫిన్ సెంటర్స్, బిర్యానీ పాంట్స్లలో ఆహార కల్తీ నియంత్రణ  , మునిసిపల్ శాఖ అధికారుల ఫోన్ నెంబర్లు అధికారులు వివరాలు సంబంధించిన బోర్డులు ఏ ఒక్కటి కూడా కనిపించవు. పట్టణంలో ఆహార భద్రత తనిఖీల అధికారుల పర్యవేక్షణ కోరవాడింది, వేములవాడ వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న  కల్తీలను అడ్డగోలుగా విక్రయిస్తున్నారు. వీటిని కొనుగోలు చేసిన వినియోగదారులు ఆరోగ్యము, ఆర్థికంగా రెండు రకాలుగా నష్టపోతున్నారు. పట్టణంలో ప్రతినెల కోట్లల్లో కల్తి వ్యాపారం జరుగుతున్న ఫిర్యాదులు చేస్తేనే స్పందిస్తామన్న రీతిలో అధికారులు తయారయ్యారు. ఆహార కల్తీ నిరోధక శాఖ అధికారి కార్యాలయం ఎక్కడ ఉందో కూడా జిల్లా ప్రజలకు తెలియదు,ఫిర్యాదులు ఎక్కడ ఎవరికి ఇవ్వాలో కూడా తెలియని పరిస్థితి.హోటల్, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, బిర్యాని సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు పై ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదులు వచ్చినప్పుడే  తనిఖీలు వస్తున్నాం..  నమూనాలను స్వీకరించి పరీక్షలకు పంపుతున్నాం అని అని చెప్పటం వరకే కానీ ఇప్పటివరకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. వేములవాడ పురపాలక సంఘం పారిశుద్ధ విభాగం, ఆహార కల్తీ నిరోధక శాఖ  అధికారులు ఆహార కల్తీలపై దృష్టి సారించడం లేదు.
ఆహార భద్రత నియమాలు పాటించకపోతే చర్యలు: అనూష ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్..
హోటల్, రెస్టారెంట్స్, టిఫిన్ సెంటర్ ఆహార పదార్థాలు కల్తీ చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే చాలా చోట్లలో తనిఖీలు చేస్తున్నాం, ఉన్నత స్థాయి ఫుడ్ సేఫ్టీ అధికారులతో తనిఖీలు నిర్వహిస్తున్నాం నిబ్బందులుగా లోబడి అమ్మకాలు చేయాలి, ఆహార భద్రత నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
సూచి శుభ్రత లేని ఆహారం వ్యాధులకు మూలం: ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆర్ మహేష్ రావు..
సూచి శుభ్రత నాణ్యత ప్రమాణాలు పాటించని ఆహారం తీసుకోవడం. బయట హోటల్, రెస్టారెంట్లో మంచి నూనె కాకుండా వాడిన నూనె మళ్ళీ మళ్ళీ ఆయిల్ లో ఫ్రై లు తినడం నాణ్యతలేని మసాలాతో చేసిన ఫుడ్ తీసుకోవడం వలన బరువు పెరగడం, అజీర్ణం, బిపి, షుగర్ రావడం రోగ నిరోధక శక్తి తగ్గడం ఇలాంటి వ్యాధుల బారిన పడతారు కిడ్నీ, క్యాన్సర్ లాంటి కల్తీ ఆహారం తీసుకోవడం వల్ల వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బయట ఆహారం తగ్గించడం చాలా మంచిది.